రాజ్ తరుణ్‌కి రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదట!

Mon 27th May 2019 07:33 PM
raj tarun,remuneration,tollywood  రాజ్ తరుణ్‌కి రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదట!
News About raj tarun remuneration రాజ్ తరుణ్‌కి రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదట!
Sponsored links

హీరో రాజ్ తరుణ్.. ఈ పేరు వింటే మనకి రెండు మూడు సినిమాలు తప్ప మరేమి గుర్తుకురావు. ప్రస్తుతం ఈహీరో వరస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఏ మూవీ పట్టుకున్న అది డిజాస్టర్ అవుతుంది. యంగ్ హీరోస్ అంత సినిమాలు మీద సినిమాలు చేస్తూ ముందుకి వెళ్లిపోతుంటే ఇతను మాత్రం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు ఉన్నాడు.

ఇతనితో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు ముందు రావడం లేదు. కానీ దిల్ రాజు మాత్రం ఇతని లేటెస్ట్ గా పిలిచి ఓ మూవీ ఆఫర్ ఇచ్చాడు. ‘ఇద్ద‌రి లోకం ఒక్క‌టే’ సినిమాని ప‌ట్టాలెక్కించాడు. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా యొక్క స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని టాక్.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈసినిమాకి గాను రాజ్ త‌రుణ్‌కి పారితోషికం అంద‌డం లేదట‌. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇతనికి రెమ్యూనరేషన్ లెవ్వట్లేదట. కేవలం ఖ‌ర్చుల‌కే డ‌బ్బులు ఇస్తున్నాడ‌ట‌. ఇటువంటి సిట్యువేషన్స్ లో రాజ్ తరుణ్ కి సినిమా దొరకడమే కష్టం. అందుకే దిల్ రాజు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా ఈ హీరో స‌ర్దుకుపోతున్నాడ‌ని టాక్‌. ఈమూవీకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

Sponsored links

News About raj tarun remuneration:

News About raj tarun remuneration

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019