‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో రామ్ ఎప్పుడు చేయని పాత్ర!

Mon 27th May 2019 07:28 PM
puri jagan,ismartshankar,hero ram  ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో రామ్ ఎప్పుడు చేయని పాత్ర!
ram plays different role in ismart shankar ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో రామ్ ఎప్పుడు చేయని పాత్ర!
Sponsored links

రామ్ - పూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. త్వరలోనే రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా యొక్క టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించుకుంది. పూరి సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో అదేవిధంగా రామ్ పాత్ర ఉంది. అయితే ఈసారి ఇంకాస్త మాసిజం క‌నిపించింది. 

అసలు ఈమూవీ లో హీరో పాత్ర ఎలా ఉండబోతుంది? అతను ఏం చేస్తుంటాడు? ఇటువంటివి ఏమి టీజర్‌లో చూపించలేదు పూరి. అయితే గత కొన్ని రోజులు నుండి ఈమూవీ లోని రామ్ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో రామ్ ఓ రౌడీ అంట. సుపారీ తీసుకున్నాడంటే – ఎంతకైనా తెగిస్తాడు.

ఒక టైములో శంక‌ర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చంపడానికి సుపారీ అందుకుంటాడు. అతన్ని చంపే క్రమంలో రామ్ కు కొన్ని విచిత్ర‌మైన స‌మ‌స్య‌లు, ఆటంకాలు ఎదుర‌వుతాయి. మరి అసలు సీఎం ని చంపడా? లేదా? అనేది సినిమాలో చూడాలసిందే. `ఇస్మార్ట్‌`లో ఇంట్ర‌వెల్ ట్విస్ట్ బాగా పేలింద‌ని తెలుస్తోంది. అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుందని..ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని పూరి తన స్క్రీన్ ప్లే తో ఇరగతీసాడని...ఇటువంటి కథను పూరి డీల్ చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. మరి ఈసారైనా పూరి - రామ్ కి సక్సెస్ వస్తుందేమో చూద్దాం.

Sponsored links

ram plays different role in ismart shankar:

ram plays different role in ismart shankar

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019