‘మౌన‌మే ఇష్టం’ టీజర్ వదిలారు

Mouname Ishtam Movie Teaser LaunchedMouname Ishtam Movie Teaser Launched

రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్ జంట‌గా ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ కోరాల‌త్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘మౌన‌మే ఇష్టం’. ఈ చిత్ర టీజ‌ర్ ను ప్ర‌ముఖ నిర్మాత శ్యాం ప్ర‌సాద్ రెడ్డి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ‘‘ట్రైల‌ర్ చాలా రిచ్‌గా వుంది. కెమెరామెన్ చ‌క్క‌టి ప‌నిత‌నాన్ని చూపించారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు అశోక్ కుమార్ కోరాల‌త్ మాట్లాడుతూ ‘‘ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేయ‌డానికి ఒక జంట మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే ఈ చిత్ర‌క‌థ‌.... సినిమా పోయెటిక్ వేలో వుంటుంది. సినిమా విజువ‌ల్స్ ఇప్ప‌టి యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి’’ అన్నారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ  ‘‘ద‌ర్శ‌కుడు అశోక్ గారు చిత్రాన్ని అద్బుతంగా తెర‌కెక్కించారు. ప్ర‌తి ఫ్రేము ఆయ‌న ఆర్ట్ వ‌ర్క్ లాగే పెయింటింగ్ లా వుంటుంది. ఈ సినిమాకు సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్శ‌ణ‌గా నిలుస్తుంది. నాజ‌ర్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. సినిమా  మొద‌ట్నుంచి ఒక కావ్యాన్ని చ‌దువుతున్న‌ట్టు వుంటుంది. ఈ చిత్రంలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.

ఈ చిత్రానికి క‌థః సురేష్ గ‌డిప‌ర్తి, సంగీతంః వివేక్ మ‌హాదేవ్‌, కెమెరాః జె.డి. రామ తుల‌సి, నిర్మాతః ఆశా అశోక్, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అశోక్ కుమార్ కోరాల‌త్‌.

Shyam Prasad Reddy Launched Mouname Ishtam Teaser

shyam prasad reddy
mouname ishtam
teaser
launch