వాట్ ఏ టైటిల్.. ‘వాల్మీకి’

Sun 27th Jan 2019 07:39 PM
varun tej,harish shankar,niharika,valmiki,movie shooting,starts  వాట్ ఏ టైటిల్.. ‘వాల్మీకి’
Valmiki Movie Launched వాట్ ఏ టైటిల్.. ‘వాల్మీకి’
Sponsored links

వరుణ్‌తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ భారీ చిత్రం ‘వాల్మీకి’ ప్రారంభం 

‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్‌2’ వంటి విభిన్న చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్న మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రం జనవరి 27న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. వరుణ్‌తేజ్‌పై చిత్రీకరించిన ఫస్ట్‌షాట్‌కు నిహారిక కొణిదెల క్లాప్‌ నివ్వగా, రామ్‌ బొబ్బ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేశారు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. 

ఈ చిత్రానికి సంగీతం: రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్‌, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, స్క్రీన్‌ప్లే: మధు, చైతన్య, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్రసాద్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌. 

Sponsored links

Valmiki Movie Launched:

Varun Tej and Harish Shankar Movie Valmiki Movie Shooting Starts

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019