భానుప్రియపై కేసు.. విషయం ఇదే..!

Case on Actress Bhanupriya

Sat 26th Jan 2019 12:21 PM
bhanupriya,case,minor child,actress bhanupriya  భానుప్రియపై కేసు.. విషయం ఇదే..!
Case on Actress Bhanupriya భానుప్రియపై కేసు.. విషయం ఇదే..!
Advertisement

మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ సీనియర్ నటి భానుప్రియపై కేసు నమోదు కావడం.. అందరిని విస్మయానికి గురి చేసింది. భానుప్రియ ఇంట్లో పనిచేసే పద్నాలుగేళ్ల అమ్మాయిపై భానుప్రియ తమ్ముడు లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా ఆ అమ్మాయి తల్లి భానుప్రియ పై కేసు పెట్టింది. తన కూతురిని పనిలో పెట్టుకుని.. ఆమెతో అడ్డమైన చాకిరీ చేయించడమేకాకుండా.. భానుప్రియ తమ్ముడు తన కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో భానుప్రియ ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక తల్లి కేసు పెట్టింది. తన కూతురిని చూడనివ్వకుండా, తన దగ్గరికి పంపకుండా వేధిస్తున్నారంటూ ఆ అమ్మాయి తల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది.

అయితే ఆ కేసుపై స్పందించిన భానుప్రియ.. తన ఇంట్లో పనిచేసే ఆ అమ్మాయి తమ ఇంట్లో కొన్ని వస్తువులు దొంగిలించి వాళ్ల అమ్మకు ఇచ్చిందని.. ఆ విషయం తెలిసి అడిగితే.. ఆ అమ్మాయి తల్లి ఆ వస్తువుల్లో కొన్ని తెచ్చిచ్చిందని.. ఇంకొన్ని తేవడానికి వెళ్లి విచిత్రంగా తిరిగి తన మీద కేసుపెట్టింది అంటూ వాపోతుంది. తమ ఇంట్లో ఏడాది కాలంగా పనిచేస్తున్న ఆ అమ్మాయి తమ ఇంట్లో నగదు, నగలు దొంగిలించి తన తల్లికి చేరవేసిందని.. నిజం చెప్పమంటే చెప్పకుండా దాటవేయడంతో.. ఆ అమ్మాయి తల్లికి ఫోన్ చేసి తమ కూతుర్ని తీసుకెళ్లమని చెప్పామని.. కానీ రివర్స్‌లో తమపై తెలివిగా కేసు పెట్టింది అంటూ.. తనపై పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు విషయంలో భానుప్రియ ఇలా స్పందించింది.

Case on Actress Bhanupriya:

Cine actress Bhanupriya about Case on Her


Loading..
Loading..
Loading..
advertisement