Advertisement

రకుల్ ఇలా ఉంటే కష్టమే!!

Wed 24th Oct 2018 11:17 PM
rakul preet singh,tollywood,movie offers,physic  రకుల్ ఇలా ఉంటే కష్టమే!!
Comments on Rakul Preet Singh Physic రకుల్ ఇలా ఉంటే కష్టమే!!
Advertisement

గత కొంత కాలం నుండి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎందుకో కనిపించడం మానేసింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోస్ సరసన నటించిన రకుల్ ఈమధ్య ఆమె జోరు తెలుగులో తగ్గిపోయింది. ఇక్కడ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ అమ్మడుకు బాగానే కలిసొచ్చింది.

గత ఏడాది కార్తీ సరసన 'ఖాకీ' సినిమాలో నటించింది. అక్కడ అది  ఘన విజయం సాధించింది. దాంతో ఆమెకు కార్తీ మరో సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. అలానే సూర్య పక్కన 'ఆర్జికె' లో కూడా ఛాన్స్ కొట్టేసింది రకుల్. అంతేకాదు శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది. ఇలా కోలీవుడ్ నుండి మంచి ఆఫర్స్ రకుల్ చేతిలో ఉన్నాయి. కోలీవుడ్డే కాదు బాలీవుడ్ లో కూడా రకుల్ అజయ్ దేవగన్ సరసన 'దే దే ప్యార్ దే' లో ఛాన్స్ కొట్టేసింది.

అంతా బాగానే ఉంది కానీ రకుల్ శరీరంలో ఈ మధ్య విపరీతమైన మార్పు కనిపిస్తోంది. డైలీ గంటలు తరపడి జిమ్ లో వర్క్ ఔట్స్ చేయడం...దాంతో ఆమె మొహంలో గ్లో పోవడం జరుగుతుంది. జీరో సైజు కోసం ఈ బ్యూటీ మరీ పీలగా అవ్వడంతో అభిమానులకు నచ్చడం లేదు. సోషల్ మీడియాలో ఆమెపై నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. హీరోయిన్స్ కొద్దిగా బొద్దుగా ఉంటేనే మొహంలో గ్లోతో పాటు ఆకర్షణ ఉంటుంది. మరీ ఇలా ఉంటే ఆఫర్స్ రావడం కూడా కష్టమే. మరి రకుల్ ఏం చేస్తుందో చూడాలి.

Comments on Rakul Preet Singh Physic:

No Offers to Rakul Preet in Tollywood

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement