అర్జున్‌రెడ్డి క్రేజ్‌కి ఇదే నిదర్శనం..!

Fri 20th Jul 2018 10:05 PM
vijay devara konda,geetha govindam,inkem inkem song,10 million club  అర్జున్‌రెడ్డి క్రేజ్‌కి ఇదే నిదర్శనం..!
Geetha Govindham Inkem Inkem Kaavale single is a huge hit అర్జున్‌రెడ్డి క్రేజ్‌కి ఇదే నిదర్శనం..!
Sponsored links

నిజంగా గత ఎంతో కాలంగా విజయ్‌ దేవరకొండలా ఒకే ఒక్క చిత్రంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయి యూత్‌కి ఐకాన్‌గా మారడం విజయ్‌ దేవరకొండ 'అర్జున్‌రెడ్డి' చిత్రంలోనే జరిగింది. ఎలాంటి పెద్ద సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు' ఇలా వచ్చిన ఆయన గ్రాఫ్‌ 'అర్జున్‌రెడ్డి'తో నేరుగా నిచ్చెనను ఎక్కింది. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన 'మహానటి' విడుదలైనప్పటికీ అది పూర్తి నిడివి కలిగి, ఆయనే హీరోగా నటించిన చిత్రం కాదు. 

ఇక 'అర్జున్‌రెడ్డి' తర్వాత చాలా కాలానికి ఆయన నటించిన 'గీతగోవిందం' విడుదలకు సిద్దమవుతోంది. మెగా ప్రొడ్యూసర్‌ అల్లుఅరవింద్‌ నిర్మాణంలో పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో కన్నడలో విజయ్‌లానే 'కిర్రాక్‌పార్టీ'తో ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిన రష్మిక మండన్న నటిస్తోంది. ఆమె ఆల్‌రెడీ 'ఛలో' చిత్రంలో నటించిన్పటికీ ఈమె ఆశలన్నీ 'గీతగోవిందం' మీదనే ఉన్నాయి. ఇలా ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. నిజానికి దీనికంటే ముందే విజయ్‌ దేవరకొండ నటించిన 'ట్యాక్సీవాలా' విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ముందుగా 'గీతగోవిందం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఇక తాజాగా ఈ చిత్రంలోని 'ఇంకేం.. ఇంకేం.. ఇంకేం కావాలే' అనే పాటను 10వ తేదీన యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాట 8రోజుల్లోనే 10మిలియన్‌ వ్యూస్‌ అంటే కోటి వ్యూస్‌ని సాధించి సంచలనం సృష్టిస్తోంది. గోపీసుందర్‌ అందించిన ఈ స్వీట్‌ మెలోడీకి అనంత శ్రీరాం క్యాచీ లిరిక్స్‌ ప్లస్‌ అయి యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతోంది. సాధారణంగా టాప్‌స్టార్‌, స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందించే పాటలకు మాత్రమే ఇలాంటి స్పందన లభిస్తుంది. కానీ ఆ ఫీట్ ని విజయ్‌ సుసాధ్యం చేసి మరోసారి తాను ఇంకో సంచలనాలకి రెడీ అవుతున్నానని దీని ద్వారా సంకేతాలిచ్చాడనే భావించాలి. 

Sponsored links

Geetha Govindham Inkem Inkem Kaavale single is a huge hit:

Vijay Devara Konda's Inkem Inkem Kaavale Song got 10 Million Viwes in Youtube

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019