అన్ని ముద్దులిచ్చినా.. 6 లక్షలేనా?

Payal Rajput Remuneration For RX 100 Movie

Sun 15th Jul 2018 05:38 PM
payal rajput,remuneration,rx 100 movie,ajay bhupathi  అన్ని ముద్దులిచ్చినా.. 6 లక్షలేనా?
Payal Rajput Remuneration For RX 100 Movie అన్ని ముద్దులిచ్చినా.. 6 లక్షలేనా?
Advertisement

కేవలం ట్రైలర్ తో ఓ సినిమాను ప్రమోట్ చేయొచ్చు అంటే చేయొచ్చు అనే చెబుతున్నారు 'ఆర్ ఎక్స్ 100' టీం. కేవలం ఒక ట్రైలర్ తోనే థియేటర్స్ కు జనాలను రప్పించేలా చేసారు మేకర్స్. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల అయిన ప్రతి చోట విజయవిహారం చేస్తోంది.

ప్రస్తుతం అంతా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ తీసుకున్న పారితోషికం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందులో రొమాన్స్ బాగా ఎక్కువ అని చూసిన వాళ్లకి అర్ధం అవుతుంది.  ఈ సినిమాలో లిప్ లాక్ లు చాలానే ఉంటాయని డైరెక్టర్ అజయ్ భూపతి ముందుగానే చెప్పడం వలన.. చాలామంది హీరోయిన్స్ రిజెక్ట్ చేసారంట.

ఒకానొక టైములో ఈ సినిమాకు హీరోయిన్ దొరకటం కష్టం అయిపోయిందంట. అలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో సెలెక్ట్ అయిందట. మరీ ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువే కాబట్టి పారితోషికం కూడా బాగానే తీసుకుని ఉంటదని అంత అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా కోసం కేవలం 6 లక్షలే తీసుకుందట. ఈ విషయం తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించే అంత మాట్లాడుకుంటున్నారు.

Payal Rajput Remuneration For RX 100 Movie:

Do you know how much Payal Rajput was paid for 'RX 100'?


Loading..
Loading..
Loading..
advertisement