ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Chara and NTR's Film Shoot at Aluminium Factory!

చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టార్రర్.. స్టార్ట్ చేశారు!

'బాహుబలి' సిరీస్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని.. సస్పెన్సుకు తెరదించుతూ పోయిన ఏడాది రాజమౌళి తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ తో మల్టీస్టార్రర్ చేయబోతున్నట్టు ప్రకటించాడు జక్కన్న. ఈ సినిమాకు ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఇప్పటివరకు పేపర్ వర్క్ మీదే ఉన్నారు మేకర్స్.

లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలకమైన టీం నేరుగా ఫీల్డ్‌లోకి దిగేసినట్లు సమాచారం. 'బాహుబలి' సిరీస్ కు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సాబు సిరిలే ఈ సినిమాకు కూడా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. ఆయన సమక్షంలో హైదరాబాద్ పరిసరాల్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మాణం జరుగుతున్నాయట. అందుకు నిర్మాత డీవీవీ దానయ్య ఆ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత స్థలాన్ని రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నారట.

అక్కడ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు టీం. డైరెక్టర్ రాజమౌళి కూడా వెళ్లి పనుల్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్టోరీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్న అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. ఈ ఏడాది లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది స్టార్టింగ్ లో షూటింగ్ చేయనున్నారు. ప్రస్తుతం తారక్.. చరణ్ లు వారి సినిమాల్లో బిజీగా ఉండటం వలన వాళ్లు ఫ్రీ అవ్వగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

Charan, NTR to Occupy That Area for 2 Years

Ram Chara and NTR's Film Shoot at Aluminium Factory!