అల్లు అర్జున్ గురించి ఈ విషయం తెలుసా?

Wed 16th May 2018 03:15 PM
  అల్లు అర్జున్ గురించి ఈ విషయం తెలుసా?
Allu Arjun and Teja Film Cancelled? అల్లు అర్జున్ గురించి ఈ విషయం తెలుసా?
Sponsored links

'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా ఇందులో కోపంతో ఊగిపోయే మిలటరీ అధికారిగా బన్నీ చూపిన పెర్ఫార్మెన్స్‌కి మాత్రం అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం గురించి, ఇందులో నటించిన అల్లుఅర్జున్‌ గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ, అల్లుఅర్జున్‌ తాను చేయబోయే సీన్‌కి సంబంధించిన డైలాగ్స్‌ని ముందుగానే అడిగి తీసుకుంటాడు. ఒకవైపు షూటింగ్‌ జరుగుతుండగా మరోవైపు ఆయన డైలాగ్స్‌ని ప్రాక్టీస్‌ చేస్తూ కూర్చుంటారు. డైలాగ్స్‌ విషయంలోనే కాదు.. ఆయన డ్యాన్స్‌ విషయంలో కూడా ఇలాగే రిహాల్సర్స్‌ చేస్తాడు. 

సాంగ్‌ షూటింగ్‌కి ముందు రెండు మూడు రోజుల ముందుగానే స్టెప్స్‌ కంపోజ్‌ అయ్యేలా చూసుకుంటాడు. అప్పటి నుంచి షూటింగ్‌కి ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంటాడు. రిహాల్సర్స్‌ లేకుండా ఆయన సాంగ్‌ షూటింగ్‌ పెట్టనివ్వడు. ఆయన హార్డ్‌వర్క్‌ చూసిన తర్వాతే ఆయన అంత స్టార్‌ ఎలా అయ్యాడో అర్ధమైంది అని చెప్పుకొచ్చాడు. ఇక బన్నీ మొదటి చిత్రం 'గంగోత్రి'లో ఈయన నటన కంటే రాఘవేంద్రరావు, కీరవాణిల భాగస్వామ్యం ఎక్కువ ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆయనపై విమర్శలే వచ్చాయి. కానీ 'ఆర్య' చిత్రంతో ఈయన తనకంటూ ఫాలోయింగ్‌ ఏర్పరచుకున్నాడు. 

కానీ తాజాగా బన్నీ వాళ్ల తల్లి మాట్లాడుతూ, నాడు ఉదయ్‌కిరణ్‌, నితిన్‌లను సక్సెస్‌ఫుల్‌గా తేజ లవ్‌స్టోరీల ద్వారా లాంచ్‌ చేయడంతో తేజ దర్శకత్వంలోనే బన్నీ మొదటి చిత్రం ప్లాన్‌ చేశారట. ఏది ఏమైనా ఆచిత్రం నుంచి తేజ తప్పుకున్నాడు. కాబట్టే ఈయనకు 'ఆర్య'వంటి చిత్రం వచ్చింది. అదే తేజ చేతిలో పడి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేవాడో మరి...! ఏది జరిగినా మన మంచికే అనేది అందుకే అంటారు. 

Sponsored links

Allu Arjun and Teja Film Cancelled?:

When Allu Arjun decided to make his debut into Tollywood, Allu family approached Teja

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019