Advertisement

అల్లు అర్జున్ ఆలా కూడా మారుతున్నాడా..?

Sun 11th Mar 2018 01:45 PM
allu arjun,producer,aham brahmasmi,krish  అల్లు అర్జున్ ఆలా కూడా మారుతున్నాడా..?
Allu Arjun Ready to Enter in New Business అల్లు అర్జున్ ఆలా కూడా మారుతున్నాడా..?
Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త అవతారమెత్తబోతున్నాడు. తన నటనతో... స్టైలిష్ లుక్స్ తో బన్నీ ఎటువంటి క్రేజ్ సంపాందించుకున్నాడో మన అందరికి తెలుసు. ఇప్పుడు ఈ హీరో కన్ను సినీ నిర్మాణంపై పడినట్టు తెలుస్తుంది.

అల్లు అర్జున్ తాజాగా క్రిష్ (జాగర్గమూడి రాధాకృష్ణ)తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. క్రిష్ తన నెక్స్ట్ మూవీ కోసం ఫిలిం ఛాంబర్ లో 'అహం బ్రహ్మాస్మి' టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఈ ప్రాజెక్ట్ కు తనతో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించేందుకు అల్లు అర్జున్ ఆసక్తిగా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

ఈ ప్రాజెక్ట్ కు సగం నేను ఇన్వెస్ట్ చేస్తానని.. వచ్చిన ప్రాఫిట్స్ లో సగం సగం పంచుకుందాం అని అల్లు అర్జున్.. క్రిష్ కి  చెప్పినట్లు సమాచారం. అయితే డైరెక్టర్ క్రిష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను తన తండ్రితో కలిసి నిర్మించాలనుకుంటున్నాడని మరో వార్త వినబడుతోంది. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్ లో కంగనా హీరోయిన్ గా మణికర్ణిక సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంతో పాటుగా ఈ అహంబ్రహ్మస్మి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సహ నిర్మాత ఎవరనే సస్పెన్స్‌కు తెరపడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Allu Arjun Ready to Enter in New Business:

Allu Arjun Turns Producer

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement