Advertisement

హమ్మయ్య.. చరణ్ గెడ్డం తీసేస్తున్నాడు!

Sun 04th Mar 2018 08:50 PM
ram charan,new look,boyapati movie,rangasthalam  హమ్మయ్య.. చరణ్ గెడ్డం తీసేస్తున్నాడు!
Ram Charan to sport a new look హమ్మయ్య.. చరణ్ గెడ్డం తీసేస్తున్నాడు!
Advertisement

రంగస్థలం స్టార్ట్ అయిన దగ్గర నుండి రామ్ చరణ్ గెడ్డాన్ని పెంచుతూనే ఉన్నాడు. సినిమా షూటింగ్ అయిపోయినా గెడ్డంను ఇంకా తీయలేదు. అయితే మరో మూడు రోజుల్లో చరణ్ న్యూ లుక్ లో కనపడనున్నాడు.

ఎందుకంటే చరణ్ తన తర్వాత సినిమాలో ఫుల్ షేవ్ తో కనిపించనున్నాడు. రంగస్థలంలో చరణ్ ది డీగ్లామ‌ర్ పాత్ర‌. పక్కా ప‌ల్లెటూరి పిల్ల‌గాడు కోసం ఖచ్చితంగా గెడ్డాలు.. మీసాలు కామ‌న్‌. సినిమా మొత్తం ఆ లుక్ తోనే కనిపించనున్నాడు చరణ్. నెల‌ల త‌ర‌బ‌డి గెడ్డాల్ని ట్రిమ్ చేయ‌కుండానే ఉన్నాడు చెర్రీ.

ఇంకో మూడు రోజుల్లో ట్రిమ్ న్యూలుక్‌తో... హ్యాండ్స‌మ్ గా కనిపించనున్నాడు బోయపాటి సినిమాలో. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మార్చి6 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గరలో అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో యాక్ష‌న్ సీన్స్ మొద‌ట తీయ‌బోతున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ తో పాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించనున్నాడు.

Ram Charan to sport a new look:

Ram Charan Ready to Boyapati Film

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement