ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Doubts on Mahesh Babu and Vamsi Paidipally Movie

మహేష్ - వంశీ పైడిపల్లి సినిమాపై డౌట్స్..!

వరసగా రెండు ప్లాప్స్ తర్వాత కచ్చితంగా ఈసారి హిట్ కొట్టితీరాలని కసి మీద ఉన్నాడు మహేష్ బాబు. అందుకోసం 'భరత్ అను నేను' సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. అయితే మహేష్ ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అని ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకమైంది.

'భరత్ అనే నేను' సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయనున్నాడని తెలిసిన సంగతే. ఈ సినిమాను దిల్ రాజు - అశ్వనీదత్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారు. అయితే పీవీపీ నిర్మాత సంస్థ కోర్టుకెళ్లింది. ఆ సినిమా నిర్మించడానికి మాకే సర్వహక్కులు ఉన్నాయంటూ కోర్టుకెక్కింది. దీంతో స్క్రిప్ట్ కాస్త కోర్టు ఆధీనంలోకి వెళ్లిపోయింది. కోర్టు ఇచ్చే తీర్పుపై ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఇది ఇలా ఉంటే మరోపక్క.. వంశీ సినిమాకు పని చేయడానికి 14 మంది టెక్నీషియన్లు రెడీ అయ్యారు అంట. కోర్టు పరిధిలో ఉన్న సినిమాకు అసలు మీరు ఎలా పని చేస్తారని...వారందరికీ కోర్టు నోటీసులు పంపించినట్టు వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చిత్ర యూనిట్టే చెప్పాలి. ఈ సినిమా ఇలా కోర్టు ఇష్యూస్ వల్ల లేట్ అయ్యే అవకాశం ఉంటే మహేష్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో చేసే అవకాశం వున్నట్లుగా టాక్.

Court Notices to Mahesh Babu 25th Film

Doubts on Mahesh Babu and Vamsi Paidipally Movie
mahesh babu
vamsi paidipalli
court case
pvp