Advertisement

హీనా.. అంత హీనంగా మాట్లాడకు: హన్సిక!

Sun 29th Oct 2017 12:06 PM
hansika,hina khan,south actresses  హీనా.. అంత హీనంగా మాట్లాడకు: హన్సిక!
Hansika Counter on Hina Khan హీనా.. అంత హీనంగా మాట్లాడకు: హన్సిక!
Advertisement

నేటితరం వారు ముఖ్యంగా సోషల్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలు బాగా విస్తృతం కావడంతో హాట్‌ ఫోటోలతోనో లేక వివాదాస్పద కామెంట్స్‌తోనో సెలబ్రిటీలుగా మారాలని చూస్తున్నారు. బాలీవుడ్‌లో బికినీ అందాలను చూపించి ఫేమ్‌ అవుతోన్న తాప్సి కూడా సౌత్‌మూవీస్‌ పైన, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుపై ఇలాంటి కామెంట్స్‌నే సోషల్‌మీడియాలో చేసి బాలీవుడ్‌లో అవకాశాలు సాధించాలని భావించింది. ఇక తాజాగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ హీనాఖాన్‌ సౌత్‌ ఇండస్ట్రీపై చెత్త కామెంట్స్‌ చేసింది. నాలుగేళ్ల కిందట మూడు నాలుగు సీరియల్స్‌లో నటించిన ఈమె బిగ్‌బాస్‌తో కాస్త ఫేమ్‌ తెచ్చుకుంది. 

ఆమె మాట్లాడుతూ.. సౌతిండియాన్‌ ఇండస్ట్రీలో హీరోయిన్లు బండగా, బబ్లీగా, ఎంతలావుగా ఉంటే అంతగా అవకాశాలిస్తారు. అక్కడిమేకర్స్‌ హీరోయిన్ల 'సైజులు' పెంచుకోమంటారు. అలా పెరిగిన సైజులను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అక్కడి డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఎంతో వల్గర్‌గా, అసభ్యకరంగా ఉంటాయి. ఇక చీరలో అటు ఇటు తిరుగుతూ అందాలను ఆరబోస్తారు' అని వ్యాఖ్యానించింది. వెంకటేష్‌, మహేష్‌బాబుల చిత్రంలో నన్ను పెట్టుకోవడానికి దర్శకనిర్మాతలు ముంబై వచ్చారని గొప్పలు చెప్పుకుంది. ఇక ఈ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని అంజలి పోషించిన పాత్ర అని అర్ధమవుతోంది. తాను మరో దక్షిణాది చిత్రాన్ని కూడా వదిలేసిందట. అది కూడా స్టార్‌ చిత్రమేనని చెప్పింది. ఇది రజనీకాంత్‌ నటించిన 'కబాలి' అని వార్తలు వస్తున్నాయి. ఇక వెంకీ, మహేష్‌ల చిత్రం చేయలేకపోయినందుకు బాగానే బాధపడ్డానని చెబుతూ, ఈ చిత్రం విషయంలో వెంకటేష్‌, మహేష్‌బాబు అభిమానులు గొడవ పడికొట్టుకుంటే కుర్చీలు విరిగిపోయాయని అబద్దాలు చెప్పింది. దీంతో ఈమె వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రముఖులకు కూడా 'బాహుబలి, రోబో, 2.0'లకు వచ్చిన, వస్తున్న క్రేజ్‌ చూసి అసూయతోనే ఇలాంటివ్యాఖ్యలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. 

అయినా దక్షిణాది రాష్ట్రాలకే చెందిన హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్‌పోజింగ్‌ చేయరని, అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అయిన భామలే అలా చేస్తున్నారని ఆమెకు తెలియకపోవచ్చు. నాటి ఐశ్వర్యారాయ్‌, కత్రినాకైఫ్‌ నుంచి దీపికాపడుకొనే, ప్రియాంకా చోప్రా వంటి వారు తెలుగులో చేసిన తర్వాతనే పేరు తెచ్చుకుని బాలీవుడ్‌ని ఏలుతున్నారు. (ప్రియాంకాచోప్రా మొదటి చిత్రం 'అపురూపం' కానీ అది విడుదల కాలేదు). ఇక హీనాఖాన్‌ వ్యాఖ్యలకు దేశముదురు అమ్మడు హన్సిక గట్టిగా రిప్లై ఇచ్చింది. ఎందరో బాలీవుడ్‌ నటీమణులు దక్షిణాదికి వచ్చిన, వస్తున్న విషయం ఆమెకు తెలియదా? అటువంటి వారినందరినీ చులకన చేసిమాట్లాడినందుకు సిగ్గుపడాలి. నేను సౌత్‌ హీరోయిన్‌ని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. హీనా చెప్పిందంతా చెత్తే. మాటలు జాగ్రత్త....షేమ్‌ ఆన్‌ హీనా..అంటూ ట్విట్టర్‌లో స్పందించింది. 

Hansika Counter on Hina Khan:

Hansika Slams Hina Khan For 'Demeaning' South Actresses, Says 'Shame On You'

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement