మహేష్ కి పోటీ గా అల్లు అర్జున్..!

Sat 29th Apr 2017 10:52 PM
allu arjun,redbus,redbus brandambassador,stylish star allu arjun,mahesh babu  మహేష్ కి పోటీ గా అల్లు అర్జున్..!
Allu Arjun Turns Brand Ambassador for Redbus మహేష్ కి పోటీ గా అల్లు అర్జున్..!
Sponsored links

అల్లు అర్జున్ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. గత ఏడాది సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ ఈ ఏడాది హరీష్ శంకర్ డైరెక్షన్ లో డీజే దువ్వాడ జగన్నాథంలో నటిస్తున్నాడు. ఆ చిత్ర ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుండి చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం కంప్లీట్ కాగానే బన్నీ రైటర్ వక్కంతమ్ వంశి డైరెక్షన్ లో నా పేరు సూర్య... లో నటిస్తాడు. ఇక సినిమాల్లోనే స్పీడు చూపిస్తున్న బన్నీ మరోపక్క యాడ్స్ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు.

బన్నీసినిమాలకున్న క్రేజ్ ని బట్టి అతని బ్రాండ్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ఇప్పటికే పలు కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న బన్నీకి కొత్త కంపెనీలు కూడా బన్నీనే తమ బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకుంటున్నాయి. నేషనల్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వున్న బన్నీ ఇప్పుడు మరో నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఇండియా మొత్తం మీద రెడ్ బస్ సంస్థ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీనికి సంబంధించిన యాడ్ షూట్ కూడా జరిగిందని చెబుతున్నారు. 

అయితే  ఈ యాడ్ లో అల్లు అర్జున్ స్టయిల్ లుక్ తో బాగా ఆకట్టుకున్నాడని అంటున్నారు. సూపర్ ఎనెర్జీతో కనబడుతున్నాడని అంటున్నారు. ఇక్కడ తెలుగులో అయితే ఆ యాడ్ ఇంకా విడుదల కాలేదుగాని హిందీలో ఈ యాడ్ విడుదలై అన్ని ఛానెల్స్ లో ప్రచారం అవుతుందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే అభి బస్ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుండగా... ఇప్పుడు రెడ్ బస్ సంస్థ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికై సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

Sponsored links

Allu Arjun Turns Brand Ambassador for Redbus:

Sarrainodu Star, Stylish Star Allu Arjun has turned brand ambassador for the renowned bus-ticket booking platform, Rebus.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019