ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajinikanth and Shankar's 2.0 Postponed

రజినీ, శంకర్ లు భలే షాక్ ఇచ్చారుగా..!

టాలీవుడ్, కోలీవుడ్ లలో తెరకెక్కే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు ఎంత శరవేగంగా షూటింగ్ చేసినా కూడా అనుకున్న టైమ్ కి రిలీజ్ కాలేక ఆపసోపాలు పడుతుంటాయి. ఒక్క బాలీవుడ్ లో మాత్రమే ఓపెనింగ్ రోజునే డేట్ ఫిక్స్ చేసి అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తారు. అలా ఇక్కడ తెలుగు, తమిళంలో ఎంత ట్రై చేసినా అనుకున్న డేట్ కి రీచ్ కాలేక చతికిలపడతారు. మొన్నటికి మొన్న 'బాహుబలి పార్ట్ 1' విషయంలో, శంకర్ 'ఐ' విషయంలోనూ ఇదే జరిగింది. 

ఇక ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్ '2.0' లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. శంకర్ - రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న '2 .0' మీద భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం వచ్చే దీపావళికి విడుదలవుతుంది అని మొదటి నుండి చిత్ర యూనిట్ చెబుతున్నప్పటికీ ఇప్పుడది ఈ దీపావళికి కాకుండా 25 జ‌న‌వ‌రి 2018లో విడుదల చేస్తున్నట్లు 2.0  నిర్మాతలు చెబుతున్నారు. 2.0  అనుకున్న టైమ్ కి రాకపోవడానికి కారణం మాత్రం  విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌నుల్లో ఆల‌స్య‌మే అని చెబుతున్నారు.  వీఎఫ్ ఎక్స్ కోసం మ‌రింత స‌మ‌యం కావాలి.. అందుకే ఇలా పోస్ట్ పోన్ చేశామ‌ని నిర్మాతలు చెబుతున్నారు.

మరి 350  కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా గా తెరకెక్కుతున్న  2.0  చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండగా... రజినీకాంత్ కి జోడిగా అమీ జాక్సన్ నటిస్తుంది. మరి శంకర్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ తో పాటు మిగతా భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. మరి ఇలా పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ ఐతే ప్రతి ప్రేక్షకుడు నిరాశలో కూరుకుపోతారు. మరి దీన్ని గమనించి 2.0  ని తొందరగా పూర్తి చేసి విడుదల చేస్తే బావుంటుంది.

2.0 movie makers have decided to release the film on 25th of January, 2018 as a Republic Day gift for fans and movie lovers.

Rajinikanth and Shankar's 2.0 Postponed
rajinikanth
shankar
two point zero
robot 2.0
rajinikanth new movie