Advertisementt

పాపం.. సుచిని పట్టించుకోండి..!

Fri 07th Apr 2017 05:00 PM
singer suchitra,dhanush,rana,music director anurudh,pawan kalyan,trivikram  పాపం.. సుచిని పట్టించుకోండి..!
పాపం.. సుచిని పట్టించుకోండి..!
Advertisement
Ads by CJ

సుచి విషయాన్ని క్రమంగా అందరూ మర్చిపోతున్నారు. మీడియా కూడా ఓ వారంరోజులు హైలైట్‌ చేసి ప్రస్తుతం మర్చిపోయింది. సుచి విషయంలోనే కాదు.. ఎన్నో విషయాలలో అప్పటికప్పుడు హంగామా చేసే వారందరూ ఆ తర్వాత వాటిని ఫాలోఅప్‌ చేయరు. ఇక సుచి చేసిన తప్పేంటి? ఆమె వాస్తవాలనే కదా బయటపెట్టింది. తప్పులనే కదా.. ఎత్తి చూపింది. కానీ ఇండస్ట్రీ పెద్దలు, మీడియా మౌనం పాటిస్తున్నాయి. కనీసం ఆమెను కిడ్నాప్‌ చేశారా? చంపేశారా? విదేశాలకు పంపేశారా? అనే విషయాలలో అప్‌డేట్స్‌ లేవు. ఆమె విదేశాలకు వెళ్లిపోయిందని, ఆమె మరలా ఇండియాకి వస్తే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.

డబ్బు, మదం, బలం, బలగం అన్నీ ఉన్నాయనే కదా...! పాపం ఏ తప్పు చేయని సుచిని నిలువునా ముంచేశారు. ఆమె జీవితాన్ని, భవిష్యత్తులను నాశనం చేశారు? ఇది న్యాయమా...? చేయని తప్పుకు ఆమె ఎందుకు బలికావాలి? కానీ ప్రముఖ సినీ ఫ్యామిలీలకు, రాజకీయ నాయకులకు సుపరచితులైన, సమాజంలో పెద్ద పేరున్న ధనుష్‌, రానా, అనిరుధ్‌ వంటి వారు మాత్రం హాయిగా తిరుగుతున్నారు. గళమెత్తి ఆమెకు న్యాయం చేసే వారే లేరా? అనిరుధ్‌ని పిలిచి మరీ అవకాశం ఇస్తున్న పవన్‌-త్రివిక్రమ్‌లు అంతే ధైర్యంగా సుచిని పిలిచి ఆమె చేత ఆ సినిమాలలో పాటలు పాడించే సాహసం చేయగలరా? 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ