Advertisement

జగన్‌ ముందు చరిత్ర తెలుసుకో..!

Fri 07th Apr 2017 05:10 PM
ysr jagan,ap cm,chandrababu naidu,tdp,congress party,ts cm,kcr,thalasani srinuvas yadav  జగన్‌ ముందు చరిత్ర తెలుసుకో..!
జగన్‌ ముందు చరిత్ర తెలుసుకో..!
Advertisement

వైఎస్‌ జగన్‌ కూడా నీతులు చెబుతున్నాడు. తమ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లి మంత్రి పదవులు తెచ్చుకున్న వారిపై, వారికి పదవి ఇచ్చిన చంద్రబాబుపై ఢిల్లీలో ఫిర్యాదులు చేసుకుంటున్నాడు. మరి తలసానికి టిఆర్‌ఎస్‌ మంత్రి పదవి ఇచ్చినప్పుడు జగన్‌ ఎందుకు కేసీఆర్‌ని విమర్శించలేదు. ఆయనకు ఇప్పుడే ఆ బాధ తెలిసిందా? దీనికి చంద్రబాబు ఇస్తున్న కౌంటర్‌ ఇప్పుడు వైరల్‌ అయింది. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ నుండి టిడిపి నుంచి ఎందరినో ఫిరాయింపులకు ప్రోత్సహించాడు. తెలుగుదేశం పార్టీలో గెలచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డిలను పార్టీలోకి తీసుకున్నారు.

ఇక అణు ఒప్పందంపై లోక్‌సభలో ఓటింగ్‌ జరిగిన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ  ఫిరాయింపులను బాగా ప్రోత్సహించింది. బహిరంగంగానే స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారు. ఇక టిడిపికి చెందిన ఎంపీలను ఆదికేశవులునాయుడు, మంథాజగన్నాథంలు కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. దానికి నజరానాగా వైఎస్‌ ఆదికేశవులు నాయుడుకు టిటిడి చైర్మన్‌ పదవి ఇచ్చాడు. వీరెవ్వరూ తమ సొంత పార్టీలకు రాజీనామాలు చేయలేదే...! మరి ఇవ్వన్నీ జగన్‌కి గుర్తులేవా...? 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement