సుచి తో పాటు మరికొందరు వస్తున్నారు!

Mon 06th Mar 2017 01:58 PM
suchitra,suchi leaks,sexual harassment  సుచి తో పాటు మరికొందరు వస్తున్నారు!
సుచి తో పాటు మరికొందరు వస్తున్నారు!

రంగుల ప్రపంచం.. గ్లామర్‌ ఫీల్డ్‌ అయిన సినీ పరిశ్రమలో తెర వెనుక భాగోతాలకు కూడా కొదవుండదు. లేట్‌నైట్‌ పార్టీలు, పబ్‌లు, పడకగది వ్యవహారాలు, ఎఫైర్లు, చాన్స్‌ల కోసం సెక్స్‌ వేధింపులు... ఇలా ఎన్నో చీకటి కోణాలున్న విషయం బహిరంగ రహస్యమే. అందరూ అని కాదు కానీ బయటకు జెంటిల్ మేన్స్‌గా కనిపించే ఎందరో ఈ తతంగాల వెనుక కనిపిస్తారు. నీతులు చెప్పే పెద్దలే ఇందులో ఆరితేరిన వారు కూడా కావడం విశేషమేమీ కాదు. ఇది అన్ని భాషల్లో, అని వుడ్‌లలో ఉన్నదే. ప్రత్యేకంగా వారే.. వీరే అని తేడా లేదు. ఎక్కువ మంది ఎన్నో వ్యసనాలు, సుఖాల కోసం ఫీల్డ్‌లోకి వస్తోంది కూడా నిష్ఠూరసత్యం. ఇక కోలీవుడ్‌ ప్రముఖులైన ధనుష్‌, శింబు, త్రిష, రానా, హన్సిక, ఆండ్రియా, అనిరుద్‌ నుంచి తోటి గాయనీమణులను కూడా సుచి లీక్స్‌ బట్టబయలు చేశాయి. ఇవి నేడు కేవలం కోలీవుడ్‌, టాలీవుడ్‌లలోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని వుడ్‌లలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. మీడియా విస్తృతం అయిన నేపథ్యంలో, సోషల్‌ మీడియాకు ఎల్లలే లేవని అర్ధమవుతుండటంతో ఇంతకాలం అన్నింటినీ మౌనంగా భరించిన వారు కూడా ఇప్పుడు చెలరేగిపోతున్నారు. నాతో పెట్టుకుంటే ఎన్నో కాపురాలు కూలిపోతాయని ఒకరు, తమ వద్ద పెద్దల భాగోతాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఒకరు, టాలీవుడ్ హీరోలు తమను సెక్స్‌ వేధింపులకు గురిచేశారని ఒకరు.. ఇలా బాధితులెందరో ముందుకు వస్తున్నారు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నించే వారు కొందరైతే .. తమకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, తమను వేధిస్తే తిప్పలు తప్పవని వార్నింగ్‌ బెల్స్‌ మోగేలా సుచి లీక్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో పలువురు తమ వద్ద కూడా ఎన్నో ఆధారాలున్నాయని అంటున్నారు. మరి నిజంగా వారి వద్ద ఆధారాలు కూడా ఉండి, తెగిస్తే మాత్రం తమ పరువు బజారున పడటం ఖాయమని బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు ఎందరో వణికిపోతున్నారనేది వాస్తవం అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.