తెలుగు ప్రేక్షకుల్లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కున్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం వీలుకాదు. ఇక ఇప్పుడు ఆయన రాజకీయంగా కూడా అడుగులు వేస్తుండటంతో, ఆయన వ్యక్తిత్వం, ఆశయాలు నచ్చిన పలువురు కొత్తగా ఆయనకు ఫ్యాన్స్‌గా తయారవుతున్నారు. దాంతో ఆయన క్రేజ్, ఇమేజ్ రోజు రోజుకూ పీక్‌కి వెళ్లిపోతున్నాయి. హీరోయిజం ఎవరెస్ట్ రేంజ్‌లో ఎదుగుతోంది. ఇక తాజాగా ఆయన నటిస్తున్న 'కాటమరాయుడు' టీజర్‌లోని ఒకే ఒక్క డైలాగ్ ఎలా పేలిందో తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను పవన్ కెరీర్‌లోనే ది బెస్ట్ అని చెప్పవచ్చు. అనూప్‌రూబెన్స్ ఇచ్చిన ఈ ట్యూన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ ఘనతతో అధికశాతం పాటను రాసిన రామజోగయ్యశాస్త్రికే దక్కుతుందనేది నిర్వివాదాంశం. టైటిల్‌సాంగ్స్‌ను రాయడంలో రామజోగయ్య సిద్ధహస్తుడు. ఈ విషయాన్ని ఎన్నో పాటలు నిరూపించాయి. కానీ 'కాటమరాయుడు'కు ఆయన అందించిన పదాలు, విశేషణాలు, పదాల కూర్పు.. పవన్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన వ్యక్తిత్వం, రాజకీయ నాయకునిగా ఆయనకు పెరుగుతున్న మైలేజ్‌కి ఈ పాట ఎంతో అద్భుతంగా సరితూగిందనేది కాదనలేని సత్యం.
మరి ఆయన తనలోని వేదనను, ఆవేదనను, రగులుతున్న ఆవేశాన్ని ఒకే ఒక్క పాటలో ఈస్థాయిలో చూపించడం అద్భుతం.. అనితర సాధ్యం. ఏ శ్రీశ్రీ కవితనో, లేక దేశభక్తి గీతాన్నో ఆనుసరించి రాయకుండా, పవనిజం విషయాన్ని ఆయన మాటల్లో చెప్పిన తీరు అబ్భురపరుస్తోంది. ఈ చిత్రంలోని ఈ పాటను 'జనసేన' పార్టీకి అధికారిక పాటగా పెట్టుకున్నా తప్పులేదనే వాదన వినిపిస్తోంది. ఒకరి వ్యక్తిత్త్వం మీద, ఇమేజ్ మీద, భావాలు, ఆదర్శాల విషయంలో రోజుల తరబడి చేసే పరిశోధనలు, రాసే పుస్తకాలు, ప్రసంగాలు, విశ్లేషణల వంటి వాటన్నింటినీ గుది గుచ్చి ఒకే ఒక పాటలో చూపించడం అసమాన్యం. ఈ పాట పవన్ జనసేన ఉన్నంతకాలం, పవన్ జీవితాంతం గుర్తుంచుకునే అద్భుత పదాల సమ్మేళంగా చెప్పాల్సిందే. ఈ విషయంలో సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రికి ఫ్యాన్స్ అభినందనల జల్లు కురిపిస్తున్నారు.