Advertisement

వచ్చే శుక్రవారం కూడా మంచి పోటీనే!

Mon 06th Mar 2017 01:01 PM
friday release movies,chitrangada,nagaram,metro,aakatayi  వచ్చే శుక్రవారం కూడా మంచి పోటీనే!
వచ్చే శుక్రవారం కూడా మంచి పోటీనే!
Advertisement

సినిమాల రిలీజ్‌కు సీజన్స్‌ ఉంటాయని, అన్‌సీజన్స్‌లో రిలీజ్‌ చేస్తే కలెక్షన్లు రావనే భావన ఇంతకాలం ఉండేది. ఈవిషయంలో కాస్త వాస్తవం కూడా ఉంది. ముఖ్యంగా విద్యార్దులకు పరీక్షల సీజన్‌ ఉంటే కలెక్షన్లు తక్కువగా ఉంటాయి. గత శుక్రవారం విడుదలైన రాజ్‌తరుణ్‌ 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', మంచు మనోజ్‌ 'గుంటూరోడు', విజయ్‌ దేవరకొండల 'ద్వారక' చిత్రాలు విడుదలయ్యాయి. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' కామెడీని, ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్ముకుంది. రాజ్‌తరుణ్‌తో పాటు 30 ఇయర్స్‌ పృథ్వీ ఇరగదీశాడు. స్పూఫ్‌ల పేరుతో ఈ మంచి నటుడిని పెద్దగా ఎలివేట్‌ చేయలేకపోతున్న మన మేకర్స్‌కి పృథ్వీ తన సత్తా ఏంటో చూపించాడు. కాగా ఎంతో కాలంగా సరైన విజయానికి నోచుకోని మనోజ్‌ 'గుంటూరోడు' చిత్రం పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా బి,సి ప్రేక్షకులను టార్గెట్‌చేసింది. ఇక ఈ చిత్రంలో మనోజ్‌, సంపత్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌లు బాగా చేశారు. 'ద్వారక' కూడా ఫర్వాలేదనిపించుకుంది. కానీ ఈ మూడు చిత్రాలకు బాక్సాఫీస్‌ వద్ద సరైన కలెక్షన్లు లేవు. 

ఇక మార్చి10వ తేదీన మరో మూడు నాలుగు చిత్రాలు రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'పిల్లజమీందార్‌' ఫేమ్‌ అశోక్‌ దర్శకత్వంలో అంజలి నటించిన 'చిత్రాంగద'పై మంచి అంచనాలే ఉన్నాయి. కాగా 'పిల్లజమీందార్‌' తర్వాత ఆదితో చేసిన చిత్రం ఫ్లాప్‌ కావడంతో అశోక్‌కి, తెలుగులో మరలా సత్తా చాటాలని చూస్తున్న అంజలికి ఇది అగ్నిపరీక్షేనని చెప్పాలి. ఈ చిత్రం ఫలితంలో ఏమాత్రం తేడా వచ్చినా అశోక్‌ దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న హైబడ్జెట్‌ మూవీ 'భాగమతి'పై ఆ ప్రభావం పడుతుంది. దీంతో యూవీ క్రియేషన్స్‌ బేనర్‌ కూడా 'చిత్రాంగద' ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక అదే రోజున సందీప్‌కిషన్‌, రెజీనాలు నటించిన 'నగరం', 'ఆకతాయి', 'మెట్రో' చిత్రాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ చిత్రాలపై కూడా పరీక్షల ప్రభావం తప్పదని అర్ధమవుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement