Advertisement

ప్రభాస్‌ అభిమానులు ఇది గమనించాలి..!

Fri 24th Feb 2017 06:32 PM
prabhas,prabhas fans,rana,bahubali  ప్రభాస్‌ అభిమానులు ఇది గమనించాలి..!
ప్రభాస్‌ అభిమానులు ఇది గమనించాలి..!
Advertisement

చదువు లేని వారికైతే అన్నీ వివరించి, అరటి తొక్కను తీసి నోటిలో పెట్టినట్లు చెప్పాలి. స్పూన్‌ ఫీడింగ్‌ తప్పదు.. ఎందుకంటే వారు నిరక్షరాస్యులు కాబట్టి. కానీ సోషల్‌ మీడియాను ఫాలో అయ్యేవారు అంటే వారికి ఖచ్చితంగా చదువు వచ్చి ఉంటుంది. విజ్ఞానవంతులు, ఎక్కువ చదువులు చదవి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే వారే అయి ఉంటారు. ప్రభాస్‌, రానాలను పోల్చడం తప్పని చాలా మంది అంటున్నారు. నిజమే.. ఏ హీరో స్టైల్‌ వారిది, ఎవరి టాలెంట్‌ వారిది. ఏ హీరో అభిమానులకు ఆ హీరో అంటే అభిమానం. ఇది నిజమే. కానీ మీ హీరోను పొగిడే సమయంలో ఇతర హీరోలను, నటీనటులను, దర్శకుల వంటి వారిని చులకన చేస్తూ, బూతులు తిట్టడం తప్పు. ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడు రానాని విమర్శించలేదని, వారిద్దరి అబిమానులు ఎంతో స్నేహితులని కొందరు అంటున్నారు. కానీ 'బాహుబలి' విడుదల తర్వాత ఆ చిత్రం రివ్యూలలో, ఇతర విషయాలలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రానాని ఎలాంటి మాటలు అన్నారు. ఎలా గేలి చేశారు? అనేవి మరోసారి ఏ వెబ్‌సైట్‌ రివ్యూకి వెళ్లి చూసినా ఆ కామెంట్స్‌ ఏమిటో కనిపిస్తాయి. ఇక ప్రభాస్‌ నవరసాలను పోషించగలిగిన మరో కమల్‌హాసన్‌లా కొందరు మాట్లాడుతున్నారు. కావాలంటే 'వర్షం, ఛత్రపతి' చిత్రాలను చూసి మాట్లాడాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఆ సలహాలకు కృతజ్ఞతలు. కాగా ప్రభాస్‌ నటించిన 'వర్షం, ఛత్రపతి' చిత్రాలనే కాదు.. ఆయన నటించిన 'ఈశ్వర్‌, రాఘవేంద్ర, చక్రం, పౌర్ణమి, యోగి, రెబెల్‌' వంటి చిత్రాల గురించి, ఆయా సినిమాలలో ప్రభాస్‌ నటనాపరంగా చేసిన తప్పులను, చివరికి మిస్‌కాస్టింగ్‌ అని ప్రభాస్‌పై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఎవరు చెబుతారు. వ్యక్తిగతంగా ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి. అందరితో స్నేహంగా ఉంటాడు. ప్రస్తుతం నేర్చుకునే స్టేజ్ లో మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇలాంటప్పుడు అభిమానులు తమ హీరోకు ఇంకొంచం బలం కావాలి కానీ..చిన్న చిన్న విషయాలను పర్సనల్ గా తీసుకుని గొడవలు పడడం..తమ హీరోకే చెడ్డ పేరు వస్తుందని గమనిస్తే మంచిది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement