Advertisement

షారుక్‌ తప్పేం లేదా...?

Tue 31st Jan 2017 11:44 AM
shah rukh khan,raees movie,sanjay bhansali,narendra modi,up,rani padmavathi,abdull lathif  షారుక్‌ తప్పేం లేదా...?
షారుక్‌ తప్పేం లేదా...?
Advertisement

సంజయ్‌లీలా భన్సాలీని దాడి చేసిన కొట్టిన వారికి ఫారుఖ్‌ చిత్రం 'రాయిస్‌' కనిపించడం లేదా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ చిత్రాన్ని ఎందుకు అంతలా ఎగబడి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి వ్యతిరేేకంగా శివసేన, విశ్వహిందు పరిషత్‌ వారు ఆందోళన చేస్తున్నారు. ఈ రెండు సంస్థలు భారతీయ సినిమాలలో పాకిస్ధాన్‌ నటీనటులను నిషేధించాలని పోరాడుతున్నాయి. కానీ షారుఖ్‌ తానే స్వయంగా నటించి , నిర్మించిన 'రాయిస్‌' చిత్రంలో పాకిస్తాన్‌ నటిమణి మహరీఖాన్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి గుజరాత్‌కు చెందిన ప్రముఖ మాఫియా డాన్‌, లిక్కర్‌డాన్‌ అయిన అబ్దుల్‌ లతీఫ్‌ను స్పూర్తిగా తీసుకున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. 

ఆయన పాత్రను షారుఖ్‌ తానే పోషించి లిక్కర్‌డాన్‌గా అద్భుతంగా నటించిన మాట వాస్తవమే. కానీ అబ్దుల్‌లతీఫ్‌ వంటి ఓ మాఫియా డాన్‌ను, సంఘవ్యతిరేకిని, మత చాందసవాదుడిని షారుఖ్‌ ఈ చిత్రంలో హీరోగా, ఎంతో గొప్పగా చూపించడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం.. భన్సాలీ అంటే మీకు అంత లోకువా? మరి షారుఖ్‌ నటించిన 'రాయిస్‌' చిత్రం షూటింగ్‌ను ఎందుకు ఆపలేదు? ఆయనపై ఎందుకు దాడి చేయడం లేదు? అలా చేస్తే ముస్లింలందరూ మీపై కత్తులు దూస్తారని, అంతర్జాతీయంగా కూడా వివాదాలకు , విమర్శలకు కారణమవుతారని...మిమ్మల్ని ఇస్లామిక్‌ ఉగ్రవాదులు టార్గెట్‌ చేసి, హిట్‌లిస్ట్‌లో పెట్టి చంపుతారని భయమా? మోదీ సొంత రాష్ట్రానికి చెందిన ఓ లిక్కర్‌డాన్‌ జీవితాన్ని అంత గొప్పగా, వీరోచితంగా చూపితే.. మరి కేంద్రం, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలు... హిందువులకు మద్దతుగా ఉంటామని చెప్పి, ఈ చిత్రం విషయంలో మౌనంగా ఎందుకు ఉంటున్నారు? ఈ చిత్రాన్ని ఎందుకు నిషేధించడం లేదు? శివసేనకు, విహెచ్‌పికి బహిరంగంగా ఎందుకు మద్దతు తెలపడం లేదు. 

రాబోయే యూపీ ఎన్నికల్లో మీకు ముస్లింలు దూరమవుతారని, ఎస్పీ, కాంగ్రెస్‌లకు దగ్గరవుతారని భయమా..? ముస్లింల ఓటు  ఏళ్లఎప్పుడూ కీలకం. అందునా యూపీలో ఇంకా కీలకం. కాబట్టే ఓట్ల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా కూడా మోదీ, అమిత్‌షాలు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతారా? ఇంతకాలానికి మరల యూపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బిజెపి రామమందిరాన్ని ఎందుకు పెట్టింది? కిందటి దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల మేనిఫెస్టోలో రామమందిరాన్ని ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు యూపీ ఎన్నికల్లో మాత్రమే రామమందిరం బిజెపికి ఎందుకు గురుకొచ్చింది? రామమందిరం అనేది దేశవ్యాప్తంగా ఉన్న మెజీర్టీ హిందువుల ఆకాంక్ష. దీన్ని బిజెపి కేవలం యూపీ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు పరిమితం చేస్తోంది? ఇంతకాలం మందిరం విషయం ఎత్తని బిజెపి ఇప్పుడు ఎందుకు మరలా ఆ రాగం అందుకుంది? దేశవ్యాప్తంగా జరితే ఎన్నికల్లో బిజెపి గెలవాలంటే ముస్లిం, క్రిస్టియన్లల ఓట్లు, మరీ ముఖ్యంగా దక్షిణాదిన పెద్దగా ప్రభావం లేని రామమందిర నినాదం మోదీ గెలుపుకు, పొత్తులకు అడ్డుపడుతుందని, కావాలనే రామమందిరాన్ని లోక్‌సభ ఎన్నికల్లో మర్చిపోయిననట్లు నటించారా? అని ప్రశ్నలు మొదలయ్యాయి. 

ఇక పవన్‌ చెప్పినట్లు రామమందిరంపై దృష్టి పెట్టి రెండుసీట్ల నుంచి ఏకంగా దేశాన్ని పాలించే స్థాయికి చేరుకున్న బిజెపి.. ఆంధ్రుల కోరిక అయిన ప్రత్యేకహోదాపై ఎందుకు దృష్టి పెట్టలేదు.? అనే విమర్శ ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తోంది. ఇక భన్సాలిని కొట్టి, ఆ చిత్రం షూటింగ్‌ను ఆపారు. అందులో నిజంగా రాణి పద్మావతిని తప్పుగా చూపిస్తున్నారో లేదో తెలియకుండానే దాడిచేశారు. మరి 'రాయిస్‌' చిత్రం ఆల్‌రెడీ విడుదలై ఘనవిజయం సాధిస్తోంది. జనాలు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు. మరి నిజంగా దేశంమీద అభిమానం ఉంటే శివసేన, విహెచ్‌పిలకు దేశవ్యాప్తంగా ఎందుకు మద్దతు రావడం లేదు? విడుదలైన చిత్రమే అలా ఉన్నప్పుడు ఎగబడి చూసి హిట్‌ చేస్తున్నారు. మరి సినిమా చిత్రీకరణలో ఉండగానే భన్సాలీ మీద ఎందుకు దాడిచేశారు? భన్సాలీనే .. కాదు.. ఎవరు చరిత్రను తప్పుగా చూపించినా మనం వ్యతిరేకించాలి. ఆ చిత్రం విడుదలైన తర్వాత అందులో అలాంటిసన్నివేశాలు ఉంటే అభ్యంతరం వ్యక్తం చేసి...న్యాయస్థానాల్లో, సెన్సార్‌పై వ్యతిరేకంగా, ప్రభుత్వాలను డిమాండ్‌ చేయాలి. అదీ వీలుకాకపోతే ఆ చిత్రాన్ని స్వచ్చందంగా ఎవ్వరూ చూడకుండా సినిమాను ఫ్లాప్‌ చేసి, నిర్మాతలకు, హీరోలకు, దర్శకులను బుద్దితేవాలి.. అదే అసలైన పరిష్కారం.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement