ఏంది భయ్యా అలా విరుచుకు పడ్డాడు!!

మెగా స్టార్ 150  వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న రాత్రి విజయవాడ సమీపంలోని హాయ్ ల్యాండ్ లో అంగరంగ వైభవం గా జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగా హీరో లు అందరూ హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అందరూ మెగా స్టార్ చిరు కి శుభాకాంక్షలు తెలుపగా.... చిరంజీవి పెద్దతమ్ముడు నాగబాబు మాత్రం ఇద్దరి వ్యక్తులని ఉతికారేసాడు. వారిలో ఒకరు ప్రముఖ నావాలా రచయిత యండమూరి వీంద్రనాథ్ కాగా మరొకరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇక వారి పేర్లు బయట పెట్టకుండా ఒక నవలా రచయిత అంటూ అతనికి అసలు బుద్ధిలేదని .... నవలలు రాసుకోక మెగా హీరో చరణ్ గురించి.. అతని వ్యక్తిత్వం గురించి నీచంగా మాట్లాడతాడా... అతనొక కుసంస్కారి అంటూ ఆయనపై విరుచుకుపడ్డాడు. ఇక రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ ఒకడు ఇక్కడ రెండు మూడు సినిమాలు తీసి ముంబై పారిపోయి పిచ్చి సినిమాలు చేసుకుంటూ పిచ్చి కూతలు కూస్తున్నాడని.... ఆన్ లైన్ లో పిచ్చి రాతలు రాస్తూ పిచ్చోడిమాదిరిగా... మెగా స్టార్ చిరంజీవి సినిమాపై కామెంట్స్ చేసే అర్హత వాడికేం ఉందని..... అసలు రీమేక్ సినిమా చెయ్యాలా... వద్దా.. అని చెప్పటానికి వాడెవడని.... చిరుని విమర్శించే స్థాయి వాడికి లేదంటూ రెచ్చిపోయి మాట్లాడేసేడు. ఇక వీటికి యండమూరి, రామ్ గోపాల్ వర్మకూడా తమదైన స్టైల్లో సమాధానం చెప్పారనుకోండి అది వేరే విషయం. ఇక ఖైదీ.... ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే డుమ్మా కొట్టాడు. ఏదో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసాడనుకోండి. అది సరిపోదు కదా మెగా ఫ్యాన్స్ కి... పవన్ కూడా ఈ వేడుకకి అటెండ్ అయితే బావుండేదని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

nagababu
khaidi no 150 movie
khaidi no 150 pre release function
spicy news
powerful speech
yandamoori veerendranath
ram gopal varma