పవన్ పక్కన బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!!

Thu 17th Nov 2016 06:07 PM
keerthy suresh,pawan kalyan,mahesh babu,director trivikram  పవన్ పక్కన  బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!!
పవన్ పక్కన బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!!
Sponsored links

మలయాళం నుండి తెలుగులోకి 'నేను శైలజ'తో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఇక్కడ మాత్రం మంచి ఆఫర్స్ ని అంది పుచ్చుకుని బాగా బిజీ అయిపొయింది. తెలుగులో రామ్ పక్కన పరిచయమైన కీర్తి అటు తమిళం లోను దూసుకుపోతుంది.  తమిళం, తెలుగు లో నటించేస్తూ బాగా బిజీ తారగా మారిపోయి ఇక్కడ రకుల్ ప్రీత్ కి గట్టి పోటీ ఇస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోలందరి పక్కన నటిస్తూ క్షణం తీరిక లేకుండా టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు కీర్తి కూడా తెలుగు సినిమాలలో వరుస అవకాశాలు కొట్టేస్తుంది.  ఒక పక్క నాని సినిమా 'పక్కా లోకల్' లో నానికి జోడిగా నటిస్తూనే ఇప్పుడు ఏకంగా పవన్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కీర్తి హీరోయిన్ గా ఎంపికైనట్టు కీర్తినే స్వయంగా సోషల్ మీడియా సాక్షిగా తెలియజేసింది. అయితే పవన్ కి జోడిగా ఇద్దరు కథానాయకులు ఉంటారని డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పుడో ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ అవకాశాన్ని కీర్తి సురేష్ ఎగరేసుకుపోయింది. మరో హీరోయిన్ కోసం త్రివిక్రమ్ సెర్చింగ్ లో వున్నదని సమాచారం. 

ఇక పవన్ పక్కన ఛాన్స్  కొట్టేసిన కీర్తి మరో పక్క మహేష్ - కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం లో కూడా మహేష్ కి జోడిగా ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. ఇక మహేష్ సినిమాలో కూడా ఆమెకు హీరోయిన్ ఛాన్స్ గనక వరిస్తే... ఒకేసారి రెండు బంపర్ ఆఫర్స్ తో ఆమె ఎక్కడికో వెళ్ళిపోతుందని అంటున్నారు. ఎంతైనా లక్కీ కదా..... తన మూడో సినిమాకే పవన్ వంటి పెద్ద హీరో పక్కన ఛాన్స్ కొట్టెయ్యడం. కీర్తి నువ్వెంతైనా లక్కీ అమ్మా....!

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019