Advertisementt

చరణ్‌ చంపేస్తున్నాడుగా..!!

Tue 01st Nov 2016 07:16 PM
ram charan,workouts,dhruva movie,upasana,rakul preet singh  చరణ్‌ చంపేస్తున్నాడుగా..!!
చరణ్‌ చంపేస్తున్నాడుగా..!!
Advertisement

తన గత చిత్రాలైన 'గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ' చిత్రాలు పూర్తిగా నిరాశపరచడంతో ప్రస్తుతం తనకు తాను, అలాగే గీతాఆర్ట్స్‌కు రెండో విజయాన్ని, చాలా గ్యాప్‌ తర్వాత తన అభిమానులకు భారీ హిట్టును ఇచ్చే పనిలో రామ్‌చరణ్‌ పండగ రోజున కూడా ఎంతో కష్టపడుతున్నాడు. తమిళ తనిఒరువన్ కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ పోలీస్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇప్పటికే దసరాకు విడుదలైన టీజర్‌తో, ఫస్ట్‌లుక్‌తో పాటు తర్వాత వరుసగా విడుదల చేస్తున్న న్యూలుక్‌ పోస్టర్స్‌తో భారీ అంచనాలు పెంచుకుంది. కాగా ఈ చిత్రం టాకీపార్ట్‌ మొత్తం పూర్తయింది. ఇక ఈ చిత్రం ఆడియోను నవంబర్‌20న, సినిమాను డిసెంబర్‌2న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా చరణ్‌పై చిత్రీకరించనున్న ఈ ఇంట్రో సాంగ్‌ కోసం చిత్ర యూనిట్‌, ముఖ్యంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి, నిర్మాత అల్లుఅరవింద్‌ భారీగా ప్లాన్స్‌ చేస్తున్నారు. ఈ పాటకు భారీ బడ్జెట్‌ను కూడా ఖర్చుచేయనున్నారు. ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్‌ హైలైట్‌ కానుందని యూనిట్‌ చెబుతోంది. కాగా పోలీస్‌గా, ప్రేయసిగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోన్న ఈ చిత్రం పాటలో తన బాడీ లాంగ్వేజ్‌ను, లుక్స్‌ని డిఫరెంట్‌గా చూపించడానికి చరణ్‌ సిద్దమవుతున్నాడు. ఇందుకోసం ఆయన దీపావళి పండగ రోజున కూడా తన కసరత్తులు ఆపలేదు. ఓ మేకింగ్‌ వీడియోను చరణ్‌ శ్రీమతి ఉపాసన ట్టిట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ తన ఫీలింగ్స్‌ను అభిమానులతో పంచుకుంది. మరి ఈ కష్టమైనా రామ్‌చరణ్‌కు ఓ భారీ విజయం అందిస్తుందనే నమ్మకంతో ఈ చిత్ర యూనిట్‌ ఎంతో నమ్మకంతో ఉంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement