ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్ కావాలంట.!

Tue 25th Oct 2016 06:18 PM
Advertisement
prabhas,parineeti chopra,director sujeeth,yuvi creations  ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్ కావాలంట.!
ప్రభాస్ కి బాలీవుడ్ హీరోయిన్ కావాలంట.!
Advertisement
బాహుబ‌లి 2 చిత్రం షూటింగ్ తర్వాత యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు ప్ర‌భాస్‌. అందుకు స్క్రిప్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు సుజిత్. ఇక ప్ర‌భాస్ అవకాశం ఇవ్వడమే ఆసల్యం అన్న ధోరణిలో ఉన్నారు డైరెక్టర్. ఇదే సంవత్సరం చివ‌ర్లో ఈ సినిమా ప్రారంభం కావచ్చు అని టాక్ నడుస్తుంది. ఇంకా బాహుబ‌లికి ప‌ని చేసిన ముఖ్యమైన టెక్నీషియ‌న్లు ఈ చిత్రానికి కూడా పని చేస్తారన్నట్లు తెలుస్తుంది. కాగా హీరోయిన్ విషయంలో కూడా ఇంకా తర్జనభర్జనలు పడుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా చేయాలని చూస్తుండటంతో  అందుకనుగుణంగా బాలీవుడ్ క‌థానాయిక‌ని ఎంపిక చేసుకొనే ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం. కాగా ఇందుకోసమని ప‌రిణితీ చోప్రాసోనాక్షి సిన్హాల‌లో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకొనే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ప్ర‌భాస్ మాత్రం ప‌రిణితీ చోప్రాని ఎంచుకోండి అని సంకేతాలిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అందుకోసం అప్పుడే చిత్ర నిర్మాత పరిణితి కోసం ప్రయత్నాలు కూడా మొదలెట్టినట్లుగా తెలుస్తుంది. కాగా అతిత్వ‌ర‌లోనే ప్రభాస్ హీరోయిన్ ఎవరన్న దానిపై ఓ క్లారిటీ కచ్ఛితంగా వస్తుందన్న టాక్ వినిపిస్తుంది. బాహుబలితో ప్రభాస్ రేంజి అమాంతం పెరిగిపోవడంతో యూవీ క్రియేషన్స్ కూడా సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదన్నది స్పష్టమౌతుంది.
Advertisement
Advertisement

Loading..
Loading..
Loading..
advertisement