Advertisementt

సీడెడ్‌లో బాలయ్య తడాఖా చూపించాడు!

Wed 28th Sep 2016 08:19 PM
ceded,balakrishna,gautamiputra satakarni,vaarahi chalana chitram  సీడెడ్‌లో బాలయ్య తడాఖా చూపించాడు!
సీడెడ్‌లో బాలయ్య తడాఖా చూపించాడు!
Advertisement
Ads by CJ

నందమూరి హీరోలకు నైజాం, ఆంధ్రాలలో కంటే సీడెడ్‌లో ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. చిత్రం హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నందమూరి హీరోల చిత్రాలు అక్కడ మంచి కలెక్షన్స్‌ సాధిస్తుంటాయి. కాగా వినూత్న చిత్రాలలో తీయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌.. బాలయ్య వందో చిత్రంగా ఇప్పుడు తన బేనర్‌లోనే స్వీయ నిర్మాణంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ హిస్టారికల్‌ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో కూడా రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రం సీడెడ్‌ హక్కులను ప్రముఖ నిర్మాత, వారాహిచలన చిత్రం బేనర్‌ అధినేత, డిస్ట్రిబ్యూటర్‌ సాయి కొర్రపాటి రూ.9కోట్లకు పొందారు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న యూనిట్‌ మరో షెడ్యూల్‌కు శ్రీకారం చుడుతోంది. పోస్ట్‌ప్రొడక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం నాలుగు టీంలు పనిచేయడానికి రెడీ అవుతున్నాయి. మొత్తానికి బాలయ్య 100వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలని భావించిన సాయి కొర్రపాటి సీడెడ్‌ హక్కులను కొనుగోలు చేసి తన కోరికలో ఎంతో కొంత సంతృప్తి చెందుతున్నాడు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ