Advertisementt

అల్లు శిరీష్ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా!

Fri 12th Aug 2016 01:31 PM
allu sirish,srirastu subhamasthu,allu sirish 4th movie news,jagadekaveeruni katha,mallidi venu  అల్లు శిరీష్ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా!
అల్లు శిరీష్ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా!
Advertisement
Ads by CJ

'శ్రీరస్తు శుభమస్తు' సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న అల్లు శిరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురుంచి అప్పుడే ఆలోచించడం మొదలెట్టేసాడు. 'గౌరవరం, కొత్త జంట' సినిమాల్లో నటించిన తర్వాత అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభమస్తు' లో నటనపరంగా మంచి ప్రతిభ కనబరిచ్చాడు. ఇక తన 4 వ సినిమా 800 సంవత్సరాల పూర్వం జరిగిన కథ లో నటించడానికి సిద్హమయ్యాడని వార్తలొస్తున్నాయి. ఈ కథ గత జన్మలో ఒక్కటి కాలేకపోయిన ఇద్దరు ప్రేమికులు మళ్ళీ ఈ జన్మలో జన్మించి తమ ప్రేమను సాధించుకునే కథగా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాతో మల్లిడి వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఇలా పూర్వ జన్మల ఇతి వృత్తాన్ని ఆధారం చేసుకుని సినిమాని తెరకెక్కించడానికి దర్శకుడిగా చాలా అనుభవం వున్న వ్యక్తి అయితే ఒకే గాని... మొదటి సినిమాకే ఇలా పూర్వకాలం కథలు అంటే అది వర్కౌట్ అవుతుందా అనేది కొంచెం అనుమానమే. కెరీర్ పరంగా చేస్తున్న 4 వ సినిమాకే ఇంత పెద్ద కథని, అనుభవం లేని డైరెక్టర్ ని ఎన్నుకోవడం చూస్తుంటే..అల్లు శిరీష్ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా! అనిపిస్తుంది. అయితే అల్లు అరవింద్ లాంటి మాస్టర్ మైండ్ ఈ కథని, డైరెక్టర్ ని  ఓకే చేసిందంటే..ఎంతో కొంత విషయం వుండే ఉంటుందని..అనుకోవాల్సిందే. ఈ సినిమా కి టైటిల్ గా 'జగదీకవీరును కథ' అని అనుకుంటున్నారని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ