డిస్ట్రిబ్యూషన్ నుండి ప్రొడక్షన్ వైపు..!

CineJosh news

భద్ర, తులసి, సింహా, దమ్ము, లెజెండ్‌ తాజాగా సరైనోడు వంటి చిత్రాలతో సెన్సేషనల్‌ దర్శకునిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు.. బోయపాటి శ్రీను. సరైనోడు చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్న చిత్రంతో శ్రీమంతుడు, రుద్రమదేవి, సుప్రీమ్‌ వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసి అతి తక్కువకాలంలో టాప్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థగా పేరుపొందిన అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని నిర్మిస్తూ.. నిర్మాణ సంస్థగా తొలి అడుగువేయబోతుంది అభిషేక్‌ పిక్చర్స్‌. 

ఈ సందర్భంగా అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత నామా అభిషేక్‌ మాట్లాడుతూ..'ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్‌ సంస్థగా ఉన్న మా అభిషేక్‌ పిక్చర్స్‌ త్వరలో బోయపాటి శ్రీను గారి లాంటి ప్రెస్టెజీయస్‌ దర్శకుని చిత్రంతో నిర్మాణ సంస్థగా మారుతున్నందుకు ఆనందంగా ఉంది. బోయపాటి గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ విషయం మీడియాకి తెలియజేస్తున్నందుకు మరింత ఆనందంగా ఉంది. సాయి శ్రీనివాస్‌ హీరోగా, బోయపాటిగారి దర్శకత్వంలో బాలీవుడ్‌ ప్రముఖ తారాగణంతో పాటు, టాలీవుడ్‌లోని టాప్‌ నటీనటులతో మేము రూపొందించనున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలైంది. భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ మూవీని ఆగస్ట్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. డిస్ట్రిబ్యూషన్‌ సంస్థగా అందరి మన్ననలు పొందిన మా సంస్థ..నిర్మాణ సంస్థగా కూడా మంచి సినిమాలను నిర్మించి..అందరి అభిమానాన్ని పొందుతామని ఆశిస్తున్నాము..' అని అన్నారు. 

abhishek pictures
production
boyapati srinu
abhishek nama
bellamkonda saisrinivas
distribution to production