Advertisementt

హారన్ సౌండ్ వద్దంటున్నాడు!

Tue 08th Mar 2016 09:41 AM
supreme,sai dharam tej first look posters  హారన్ సౌండ్ వద్దంటున్నాడు!
హారన్ సౌండ్ వద్దంటున్నాడు!
Advertisement
Ads by CJ

మెగా కుర్ర హీరోల్లో సాయి ధరం తేజ్ రూటే సపరేటు అన్నట్టుగా సాగుతోంది. వరుణ్ తేజ్ కొత్త పంథాలో ముందుకు సాగుతుంటే సాయి మాత్రం మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల చరిష్మాను వాడుకుంటూ సరైన మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సేఫ్ చిత్రాలతో బండిని ట్రాక్ మీదే ఉంచిన సాయి నుండి వస్తున్న తదుపరి చిత్రం సుప్రీం. సరాసరి చిరంజీవి గారి ఒకప్పటి బిరుదునే తన సినిమా పేరుగా మార్చుకున్న సాయి కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కొంత సేపటి క్రితమే మహా శివరాత్రి కానుకగా మార్కెట్టులో దిగబడ్డాయి. డోంట్ సౌండ్ హారన్ అంటూ ట్యాగ్ తగిలించుకొని పక్కా మాస్ లుక్కుతో టాక్సీ డ్రైవర్ పాత్రలో సరిగ్గా నప్పినట్టు కనపడుతున్నాడు. పటాస్ చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ మలుపు తిప్పిన దర్శకుడు అనీల్ రావిపూడి సెకండ్ మూవీయే ఈ సుప్రీం. ఏప్రిల్ 1న సినిమా రిలీజుకు నిర్మాత దిల్ రాజు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హీరోయిన్ రాశి ఖన్నా, సంగీత దర్శకుడు సాయి కార్తీక్.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ