'తులసీదళం' రిలీజ్ డేట్ ఖరారు!

Tue 08th Mar 2016 10:19 AM
tulasidalam movie,nischal,r.p.patnaik,vandana guptha  'తులసీదళం' రిలీజ్ డేట్ ఖరారు!
'తులసీదళం' రిలీజ్ డేట్ ఖరారు!
Sponsored links

నిశ్చల్, వందన గుప్తా జంటగా కలర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై  కిషోర్ కంటమనేని సమర్పణలో ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'తులసీదళం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లలో రిలీజ్ చేస్తున్నాం. హారర్ సినిమా అంటే రాత్రిపూట ఎక్కువగా చిత్రీకరిస్తారు. కానీ మా చిత్రాన్ని ప్రపంచంలోకెల్లా అత్యధిక వెలుతురు గల ప్రాంతమయిన లాస్ విల్లాస్ లో షూట్ చేశాం. ఆ ప్రాంతంలో ఎప్పుడూ లైట్ ఉంటూనే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో అన్ని ఎమోషన్స్ కలగలిపి చిత్రీకరించాను. తులసీదళం అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అనుకుంటున్నారు. కాని మా సినిమా ఆ నవలతో కంపేర్ చేసి చూడొద్దు. ప్రతి ప్రేమకు ఒక సమస్య ఉంటుంది. ఈ సినిమాలో ప్రేమకథకు సమస్య హారర్. ఈ సినిమాకు దర్శకత్వం, మ్యూజిక్ అందించడంతో పాటు ముఖ్యమైన పాత్రలో కూడా నటించాను. ఆ పాత్ర కొత్తగా ఉంటుంది. ఇదొక మ్యూజిక్ ఫిలిం అనొచ్చు. అన్ని మెలోడీ సాంగ్స్ ఉంటాయి. బ్రహ్మానందం గారు భూత వైద్యుడి పాత్రలో కనిపిస్తారు'' అని చెప్పారు.

నిశ్చల్ మాట్లాడుతూ.. ''45 రోజులు అందరం ఓ కుటుంబంలాగా కలిసి పని చేశాం. మార్చి 11న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

అచ్చిబాబు మాట్లాడుతూ.. ''ఆర్.పి.పట్నాయక్ గారితో కలిసి ఈ సినిమా చూడగానే మంచి కథ అనిపించింది. ఎలాగైనా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్.పి గారిని అడిగాను. మినిమన్ గ్యారంటీ మూవీస్ పేరిట రీసెంట్ గా నైజాంలో శివగంగ చిత్రాన్ని రిలీజ్ చేశాం. ఈ చిత్రాన్ని సుమారుగా 200 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం'' అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దీపక్ రావెల్ల, అనితాచౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి డైలాగ్స్: తిరుమల్ నాగ్, అసిస్టెంట్ డైరెక్టర్: శ్రీ కిరణ్, ఎడిటర్: ఎస్.బి. ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: శరత్ మండవ, కో ప్రొడ్యూసర్: దిలీప్ వడ్లముడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నందన కుమార్ పొట్లూరి, కథ-స్క్రీన్ ప్లే-మ్యూజిక్-నిర్మాత-దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019