Advertisementt

అక్కడ ఫర్వాలేదు, ఇక్కడే మునిగింది!

Mon 07th Mar 2016 09:06 PM
shiva ganga,raai lakshmi,sreeram  అక్కడ ఫర్వాలేదు, ఇక్కడే మునిగింది!
అక్కడ ఫర్వాలేదు, ఇక్కడే మునిగింది!
Advertisement
Ads by CJ

హారర్ సినిమాలకు ఇండియా మొత్తం భలేగా క్రేజ్ ఉంటోంది. అందుకే లిమిటెడ్ బడ్జెట్ మీద ఉండే నిర్మాతలు ఈ జోనరుకు కామెడీనో, థ్రిల్లునో జతకలిపి జాగ్రత్తగా సినిమా తీసేస్తూ లాభాలు దండుకుంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు తెలుగులో తీసినా, తమిళంలో తీసినా హారర్ చిత్రాలకు భాషాభేదం ఉండబోదు కాబట్టి అక్కడా ఇక్కడా రిలీజ్ చేసేసి వీలైనంత ఎక్కువగా వసూళ్లు రాబట్టుకుంటున్నారు. అలా ఎక్కువ రోజులు నానబెట్టి మన మీదకి వదిలిన హారర్ చిత్రంగా శివగంగ మొన్న శుక్రవారమే సినిమా హాల్లలో దిగింది. శ్రీరాం, రాయ్ లక్ష్మి ముఖ్య తారాగణంగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నామమాత్రంగా జనాన్ని ఆకర్షించినా రెండో రోజు నుండి వెనకబడి పోయింది. తెలుగులో పరిస్థితి ఇలా ఉంటె, తమిళంలో మాత్రం సౌకార్ పేట్టై అంటూ రిలీజయి మంచి కలెక్షన్స్ వసూల్ చేస్తోంది. రాయ్ లక్ష్మికి తెలుగులో కంటే తమిళంలో ఫ్యాన్స్ ఎక్కువ. సినిమా టాక్ యావరేజ్ అనిపించుకున్నా, ఆమంటే పడిసచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు గనక తమిళ బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదని అనిపించుకుంటోంది. పాపం తెలుగులోనే శివగంగ అడ్డంగా గంగలో మునిగింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ