రోహిత్ సింగేసాడు!

Thu 25th Feb 2016 02:37 PM
nara rohit,singer rohit,savithri  రోహిత్ సింగేసాడు!
రోహిత్ సింగేసాడు!
Advertisement
Ads by CJ

అందరు హీరోలు తమ తమ గాత్ర మాధుర్యాన్ని పరీక్షించుకోడానికో లేక అభిమానులను అలరించడానికో తెలీదు గానీ అలా అలా సింగర్లు మాత్రం అయిపోతున్నారు. అందుకే నారా రోహిత్ కూడా తానెందుకు ట్రై చేయకూడదు అనుకోని సావిత్రి సినిమా కోసం పాట పాడేయడమే కాకుండా మీడియా మిత్రులని ఆహ్వానించి మరీ గ్రాండుగా ఆ పాటని జనాల్లోకి వీడియోతో సహా వదిలేసాడు. మంచి హుశారేక్కించే బీట్ ప్రధానంగా సాగిన పాటలో మార్ మార్ తీన్ మార్, గుండె జారె బార్ బార్ అంటూ సాహిత్యంలో రిథమ్ కూడా మేనేజ్ చేసాడు సంగీత దర్శకుడు శ్రవణ్. అన్ని పాటల్లాగానే రోహిత్ రికార్డింగ్ స్టూడియోలో పాడుతూ ఉండడం, పక్కనే దర్శకుడు అండ్ మ్యూజిక్ టీం ఎంకరేజ్ చేస్తూ ఊగిపోవడం లాంటి విజువల్స్ వీడియోలో పొందుపరిచి సావిత్రిని జనాలకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేసారు. మొత్తానికి నారా రోహిత్ ప్రయత్నం మాత్రం అభినందించదగినదే. సినిమాలో కూడా ఈ పాట హీరోగారు హీరోయిన్ ప్రేమ కోసం వెంట పడే క్రమంలో వచ్చినట్లుగా అనిపించింది. రోహిత్ పాడిన పాటలో ఎనర్జీ అయితే ఉంది, మరి స్క్రీన్ మీద రోహిత్ తన డ్యాన్సులతో మరింత ఊపు తీసుకోస్తాడో లేదో చూడాలి!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ