Advertisementt

బాలయ్య మాటలకు చిరంజీవి నొచ్చుకోలేదా?

Thu 25th Feb 2016 02:31 PM
balakrishna,chiranjeevi,lepakshi controversy  బాలయ్య మాటలకు చిరంజీవి నొచ్చుకోలేదా?
బాలయ్య మాటలకు చిరంజీవి నొచ్చుకోలేదా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ గారికి మీడియా ముందు గానీ, సభా స్థలిలో గానీ చేతిలో మైక్ పెడితే దబిడి దిబిడే. అక్కడే ఉండే జనాల పరిస్థితి ఏమో గానీ ఆ వీడియోని టీవీలలో, సోషల్ మీడియాలోనే కాక పక్క రాష్ట్రాలలో కూడా షేర్ చేస్తూ విపరీతమైన న్యూ సెన్స్ క్రియేట్ చేస్తారు నెటిజెన్లు. నిన్న చిరంజీవి గారి గురించి బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు కూడా ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది. లేపాక్షి ఉత్సవాలకు మీ మిత్రుడు చిరంజీవిని ఆహ్వానించారా అంటే, అయితే అవుననాలి లేదా కాదనాలి గానీ నా నెత్తి మీద కూర్చునే వారిని పిలవను అని చిరంజీవిని, ఆయనను అభిమానించే వారి మనోభావాలను దెబ్బతీసారు. దీనికి రియాక్షన్ సోషల్ మీడియాలో దారుణంగా వస్తున్నా చిరంజీవి మాత్రం ఎక్కడలేని సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. బాలకృష్ణ నుండి ఇటువంటి అసందర్భపు సంఘటనలు ఎదురుకావడం చిరంజీవికి మొదటిసారి కూడా కాదు. అందుకే తన వైపు నుండి ఎలాంటి స్పందన వచ్చినా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందన్న ముందు ఆలోచనతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ గమ్మున ఉన్నారట. చిరు, బాలయ్యలు కలిస్తే స్నేహంతో, ప్రేమతో ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాంటి సీన్లు ఎన్నోసార్లు మనం చూసాం కూడా. మరి ఈ బాలయ్య ప్రేలాపణలు కూడా ఆ చనువులో భాగమే అనుకుందామా? 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ