Advertisement

నారా రోహిత్ పాట రిలీజ్ అయింది!

Thu 25th Feb 2016 02:29 PM
savithri special song release,nara rohit,pawan sadhineni  నారా రోహిత్ పాట రిలీజ్ అయింది!
నారా రోహిత్ పాట రిలీజ్ అయింది!
Advertisement

నారా రోహిత్, నందిత జంటగా పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా.వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'సావిత్రి'. ఈ సినిమాలో నారా రోహిత్ పాడిన స్పెషల్ సాంగ్ ను సాయి కొర్రపాటి బుధవారం హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా..

నారా రోహిత్ మాట్లాడుతూ.. ''సాయి కొర్రపాటి గారు నేను పాడిన మొదటి పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. రెండు సంవత్సరాలుగా పవన్ నేను ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ట్రావెల్ చేస్తున్నాం. కాని ప్రసాద్ గారు వచ్చిన తరువాతే ఈ సినిమా చేయడం సాధ్యమైంది. షార్ట్ స్పాన్ లో సినిమా చేశారు. ఆర్టిస్ట్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. 'సోలో' సినిమా తరువాత నా కెరీర్ లో అంతమంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిలుస్తుంది'' అని చెప్పారు.

నిర్మాత డా.వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''సావిత్రి' కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. కుటుంబ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. మార్చి 4న పాటలను విడుదల చేసి, మార్చి 25న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో రోహిత్ ఒక పాట పాడాడు. రోహిత్ లో ఇంత మంచి సింగర్ ఉన్నారని నాకు తెలియదు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ.. ''ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. నా మొదటి సినిమా 'ప్రేమ ఇష్క్ కాదల్' చూసిన డిస్ట్రిబ్యూటర్ ఒకాయన సినిమా చాలా బావుంది కాని యూత్ ఫుల్ సినిమాలు చేస్తే ఒక టికెట్ మాత్రమే తెగుతుంది. ఫ్యామిలీ సినిమా చేస్తే నాలుగు టికెట్స్ తెగుతాయని చెప్పారు. అందుకే ఓ కుటుంబ కథా చిత్రం చేయాలనుకున్నాను. నేను చెప్పిన లైన్ నచ్చి ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మించారు. రోహిత్ నాకు బ్రదర్ లాంటి వాడు. సావిత్రి పాత్రలో నందిత చక్కగా నటించింది. శ్రవణ్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. మార్చి 4న ఆడియో, మార్చి 25న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

నందిత మాట్లాడుతూ.. ''రోహిత్ ఈ సినిమాలో పాట పాడాడంటే మొదట నమ్మలేదు. తరువాత వీడియో చూసి సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగా పాడాడు. పవన్ నన్ను మైండ్ లో పెట్టుకునే నా పాత్ర రాశాడు. ఫ్యామిలీ షూటింగ్ లా అనిపించింది'' అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సాయి కొర్రపాటి, మధునందన్, కృష్ణచైతన్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - వసంత్, డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు , ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement