లాస్ట్ బస్, మళ్ళీ భయపడండి

Thu 25th Feb 2016 02:37 PM
last bus,kannada movie,telugu dubbing  లాస్ట్ బస్, మళ్ళీ భయపడండి
లాస్ట్ బస్, మళ్ళీ భయపడండి
Advertisement
Ads by CJ

భాష ఏదైనా అది హారర్ జోనర్ అయితే చాలు, తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు అనే స్థాయికి చేరిపోయింది ఇక్కడ హారర్ చిత్రాల మార్కెట్ వ్యాల్యూ. ముందు తమిళం నుండి చాలా భయానక చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి కాసులు కుమ్మరించుకున్నారు నిర్మాతలు. ఇప్పుడు కన్నడ వంతు వచ్చింది. కర్ణాటకలో సూపర్ హిట్ అయిన లాస్ట్ బస్ చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ రైట్స్ కైవసం చేసుకున్న శ్రీ మంజునాథ మూవీ మేకర్స్. లాస్ట్ బస్ ఆర్జించిన లాభాలను చూసి ఇప్పుడు ఫ్రెంచ్ వారు కూడా తమ భాషలోకి డబ్బింగ్ చేసుకుంటున్నారు. అందుకే కన్నడ నిర్మాతలకు భారీ అమౌంట్ ఇచ్చి మరీ తెలుగు హక్కులు కైవసం చేసుకున్నారు. SD అరవింద్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కూడా గట్టి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. అంటే మునిలు, కళావతిల తరువాత తమిళం కాకుండా కన్నడ నుండి కూడా తెలుగులోకి హారర్ చిత్రాలు దిగుమతి కావడం విశేషం. ఓ అటవీ ప్రాంతం నుండి బయల్దేరిన ఆఖరి బస్సు షార్ట్ కట్ రూటులో గమ్యాన్ని చేరుకోవడానికి పోయి విచిత్రమైన బంగ్లాలోకి చేరుతుంది. సగం మంది బస్సులోని ప్రయాణీకులు అక్కడి నుండి పారిపొయినా మిగిలిన సగం అక్కడ తమ ప్రాణాలను ఎలా పోగుట్టుకున్నారు. అక్కడ బంగ్లాలో నిజంగా ప్రేతాత్మలు ఉన్నాయా లేక ప్రయాణీకులే తమలో తాము లేని పోని భయాలను ఊహించేసుకుని చావుకు దగ్గరగా వెళ్ళారా అన్నది థ్రిల్. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ