Advertisementt

త్రిషతో పోటీ పడుతున్న కుర్రహీరో

Fri 22nd Jan 2016 07:50 PM
raj tharun,seethamma andalu ramayya sithralu,kalavathi  త్రిషతో పోటీ పడుతున్న కుర్రహీరో
త్రిషతో పోటీ పడుతున్న కుర్రహీరో
Advertisement
Ads by CJ

ఈ వారం ఎలాగూ ఒక్క తెలుగు సినిమా కూడా విడుదలకు సిద్ధం లేకపోవడంతో ఇండస్ట్రీ కన్ను మొత్తం వచ్చే వారం అంటే జనవరి 29నాటి చిత్రాల మీద పడింది. ఇప్పటి వరకు నాలుగు పేర్లు ప్రప్రముఖంగా వినపడుతున్నా రాజ్ తరుణ్ నటించిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు మరియు త్రిష, హన్సిక, పూనం భాజ్వాలు చేసిన హారర్ కామెడీ కళావతి మీదే అందరి దృష్టీ ఎక్కువగా ఉంది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా, కుమారి 21 F వరస హిట్లతో జోరు మీదున్న ఈ కుర్ర హీరో నాలుగో సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ మొదలు పెట్టాలని ఉవ్విల్లూరుతున్నాడు. ట్రైలర్ చూసిన తరువాత సినిమాలో విషయం ఉందని అర్థమయినా రేపు హాళ్ళలో ప్రేక్షకుల స్పందనను బట్టే ఓవరాల్ టాక్ ఆధారపడి ఉంటుంది. మరో వైపు చంద్రకళతో హిట్టు కొట్టిన దర్శకుడు సుందర్ C దానికి తరువాయిగా అరన్మనై 2 తమిళ చిత్రాన్ని తెలుగులో కళావతిగా రిలీజ్ చేస్తున్నారు. త్రిషకు తెలుగు, తమిళంలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కళావతికి ఓపెనింగ్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. మరి సీనియర్ త్రిష ముందు జూనియర్ రాజ్ తరుణ్ ఎంత వరకు నిలబడగలుగుతాడో వెయిట్ అండ్ సి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ