Advertisementt

రాజమౌళి, త్రివిక్రమ్‌ల మధ్య వైరం..మ్యాటరెంటీ?

Thu 12th Nov 2015 01:41 PM
ss rajamouli,trivikram srinivas,sunil,nithiin,ss rajamouli vs trivikram srinivas,trivikram birthday  రాజమౌళి, త్రివిక్రమ్‌ల మధ్య వైరం..మ్యాటరెంటీ?
రాజమౌళి, త్రివిక్రమ్‌ల మధ్య వైరం..మ్యాటరెంటీ?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందని టాలీవుడ్‌ కోడైకూస్తోంది. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలతో త్రివిక్రమ్‌ సినిమాలు చేయకపోవడం, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించిన హీరోలతో రాజమౌళి దూరంగా ఉండటం అనేది చర్చనీయాంశం అయింది. అయితే తొలిసారిగా రాజమౌళి 'సై' చిత్రంలో నటించిన నితిన్‌తో త్రివిక్రమ్‌ ప్రస్తుతం 'అ..ఆ' అనే చిత్రం చేస్తుండటం గమనార్హం. చివరకు త్రివిక్రమ్‌ ప్రాణస్నేహితుడైన హీరో సునీల్‌తో రాజమౌళి 'మర్యాద రామన్న' చిత్రం చేశాడు. కానీ సునీల్‌ ఎప్పటినుండో త్రివిక్రమ్‌ను ఓ సినిమా చేసిపెట్టమని అడుగుతున్నా.. త్రివిక్రమ్‌ మాత్రం ఆయనతో సినిమా చేయకుండా తప్పించుకుంటున్నాడు. కాగా ఇక్కడ రాజమౌళి, త్రివిక్రమ్‌ల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోందని చెప్పడానికి ఓ మంచి ఉదాహరణ చూపిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సాదారణంగా టాలీవుడ్‌ ప్రముఖులు పుట్టినరోజున అందరికీ విషెష్‌ చెప్పే రాజమౌళి.. త్రివిక్రమ్‌ బర్త్‌డేను మాత్రం మర్చిపోవడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో తెలియని గ్యాప్‌ ఉందని సినీజనాలు చెవులు కొరుక్కుంటున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ