అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న సమంత..!

హీరోయిన్‌ సమంత అతి తక్కువ కాలంలోనే సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే తీసుకుంటోంది. అయితే తాను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్‌ స్థాపించిన సమంత ఈ ఆర్గనైజేషన్‌ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్‌ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా ఆమె అవయవదానం కార్యక్రమంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకొంది. తాను స్వయంగా అవయవదానం చేయడమే కాకుండా తన అభిమానులను కూడా ఆ దిశగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. అవయవ దానంను ఉద్యమంగా సాగేలా తనవంతు ప్రయత్నం చేస్తానంటోంది సమంత...! 

samantha
prathyusha foundation
organ donation program