జూనియర్ ఎన్టీయార్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో మురుగ దాస్ అందించే కథ, కథనంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతుంది అన్న వార్త ఇంతదాకా పుకారుగానే మిగిలిపోయింది. ఇక ముందు కూడా ఈ కాంబినేషన్ తెరకెక్కే అవకాశం కాసింత కూడా కనపడడం లేదు. విశేషం ఏమిటంటే, గోపీచంద్ మలినేని కూడా ఈ ప్రాజెక్టు మీద ఆశలు వదులుకొని వరుణ్ తేజ్ కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు.
ఎన్టీయార్ తదుపరి చిత్రం కొరటాల శివతో అనౌన్స్ అయిన మరుక్షణమే గోపీచంద్ కూడా గోడ దూకేసాడు. ప్రస్తుతానికి భిన్నమైన సినిమాలతో మంచి హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్న వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్ లోఫరుతో కమర్షియల్ లీగులోకి అడుగు పెట్టబోతున్నాడు. కానీ కథ, కథనాలు కొత్తగా ఉండేలా విభిన్నమైన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాపుతో వరుణ్ తేజను ఇంకో కోణంలో ఆవిష్కరించే ప్రయత్నంలో గోపీచంద్ మొదటి మెట్టు ఎక్కేసాడు. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధులు నిర్మాణ భాధ్యతలు తీసుకోబోతున్న ఈ చిత్రం లోఫర్ తరువాత వెంటనే మొదలయ్యే సూచనలు కనపడుతున్నాయి.