షేర్‌ తో షేక్‌ చేస్తాడా..?

Wed 28th Oct 2015 01:58 AM
sher movie,kalyan ram,patas movie,anil ravipudi  షేర్‌ తో షేక్‌ చేస్తాడా..?
షేర్‌ తో షేక్‌ చేస్తాడా..?
Advertisement

నందమూరి కళ్యాణ్‌రామ్‌... నిన్నటివరకు అతనొక్కడే తప్ప మరో పెద్ద హిట్‌ లేని హీరో. ఫ్యామిలీ బలగం ఉన్నప్పటికీ ఆయనకు మరో పెద్ద హిట్‌ రాలేదు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన పటాస్‌ చిత్రం అద్బుత విజయం సొంతం చేసుకొంది. ఏకంగా 20కోట్ల క్లబ్‌లో ఆయనకు స్థానం కల్పించింది. పటాస్‌ కంటే ముందే ప్రారంభం అయిన షేర్‌ను కాదని, ముందుగా పటాస్‌తో వచ్చిన కళ్యాణ్‌రామ్‌ ప్లాన్‌ బాగా వర్కౌట్‌ అయింది. ఇలా ఈ ఏడాది ప్రారంభంలోనే సూపర్‌హిట్‌ కొట్టిన కళ్యాణ్‌రామ్‌ అదేదో ఉత్తి గాలివాటంగా తనకు రాలేదని నిరూపించుకోవాలంటే ఇప్పుడు షేర్‌ తో ఆయన మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సండడి చేయాల్సిన అవసరం ఉంది. పటాస్‌ ఘనవిజయం తర్వాత మరలా అప్పటివరకు చిత్రీకరించిన షేర్‌ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మార్చి దీనిని కూడా మరో పటాస్‌ లా పక్కా యాక్షన్‌ కామెడీ మూవీగా తెరకెక్కించి...ఆయన ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా టాలెంట్‌ ఉంటే ఫ్లాప్‌లిచ్చిన దర్శకులకు కూడా చాన్స్‌ ఇచ్చే గట్స్‌ ఆయనకు ఎక్కువగా ఉన్నాయి. గతంలో తనకు అభిమాన్యు, కత్తి లాంటి ఫ్లాప్‌లిచ్చిన దర్శకుడు మల్లికార్జున్‌కు మరోసారి ఆయన ఈ సినిమా దర్శకత్వం బాధ్యతలు అప్పగించడం విశేషం. మల్లిలోని టాలెంట్‌ను తప్పితే ఆయన హిట్స్‌, ఫ్లాప్స్‌లను పట్టించుకోకుండా మూడో సారి అవకాశం ఇచ్చి ఆయనపై ఉంచిన నమ్మకాన్ని మల్లికార్జున్‌ నిలబెట్టుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్స్‌ మాత్రం బాగున్నాయి. బ్రహ్మానందం, స్వర్గీయ ఎమ్మెస్‌నారాయణ, పోసాని, అలీ, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ తదితరులతో ఈ చిత్రం నిండివుండటంతో ఇక కామెడీకి ఢోకాలేదని అంటున్నారు. మరి కళ్యాణ్‌రామ్‌ తన షేర్‌ తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తాడో లేదో వేచిచూడాల్సివుంది..! 


Loading..
Loading..
Loading..
advertisement