వైట్ల ఫ్యామిలీలో మధ్యవర్తిత్వం

Wed 28th Oct 2015 02:20 AM
srinu vytla,roopa vytla,ramcharan,bruce lee,mega family  వైట్ల ఫ్యామిలీలో మధ్యవర్తిత్వం
వైట్ల ఫ్యామిలీలో మధ్యవర్తిత్వం
Advertisement

హిట్టు సినిమాలతో వినోదానికి అసలు సిసలు కేరాఫ్ అడ్రసుగా మారిన శ్రీను వైట్ల పరిస్థితి ఇంతలోనే అంత దారుణంగా ఎలా అయిపోయిందబ్బా అనుకుంటున్నారు సగటు సినిమా ప్రేక్షకులు. కేవలం బడా హీరోలతోనే భారీ నిర్మాణ వ్యయంతో వరస ప్రాజెక్టులు చేస్తున్న వైట్లకు కెరీర్ పరంగా గత మూడేళ్ళుగా మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. దర్శకత్వంలో ఉండే ఆపసోపాలు తెలిసినవాడే కాబట్టి ఒక్క సరైన విజయం పడితే, ప్రేక్షకులు అన్నీ మరిచిపోతారు అనుకోవచ్చు. కానీ తన భార్య రూపా పేరిట ఇలా అనుకోని విపత్తు వచ్చి పడుతుందని కలలో కూడా ఊహించి ఉండడు శ్రీను.

 

పని ఒత్తిడి తట్టుకోలేక రూపాపై శ్రీను మానసిక వేధింపులకు దిగినట్లు బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అవడం, ఆ వెంటనే కొద్ది గంటల్లోనే రూపా వైట్ల కేసును మళ్ళీ విత్ డ్రా చేసుకోవడం సంచలనం రేపింది. తెర వెనక అసలు ఏం జరిగిందా అని ఆరా తీయబోతుంటే, ఓ బడా వ్యక్తి మధ్యవర్తిత్వంతోనే రూపా వైట్ల శాంతించినట్టు తెలుస్తోంది. కేసు ఫైల్ అయిన మరుక్షణమే సినీ పరిశ్రమకు సంబంధించిన ఈ ప్రముఖ వ్యక్తి  వద్ద శ్రీను వైట్ల సహాయం కోరడంతో అంతా గప్ చుప్పుగా ముగిసిపోయిందట. బ్రూస్ లీకి ముందు శ్రీనుతో అభిప్రాయ భేదాల మీద ఇలాగే విడిపోయిన కోన వెంకట్, గోపి మోహనులను మధ్యవర్తిత్వం చేసి మళ్ళీ జట్టుగా చేసాడు రామ్ చరణ్. సినిమా కోసం అయితే చరణ్ చేసాడు, మరి వైట్ల పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసిన ఆ వ్యక్తి కూడా మెగా ఫ్యామిలీ నుండే అయి ఉంటాడేమో అన్నది ఇప్పటికి ఇంకా సస్పెన్సే...


Loading..
Loading..
Loading..
advertisement