వెంకీ నుండి నాగ్‌కు..?

ఈమధ్య ఎందువల్లో గానీ విక్టరీ వెంకటేష్‌ తన వద్దకు వస్తున్న చిత్రాలను, కథలను, దర్శకులను ఎక్కువగా తిప్పించుకుంటున్నాడు. చాలాగ్యాప్‌ రావడంతో ఆయన సినిమాలపై ఎలాంటి డెసిషన్స్‌ తీసుకోలేకపోతున్నాడని, కుటుంబ సమస్యల వల్లే ఆయన ఈ గ్యాప్‌ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి ఫీల్‌గుడ్‌ సినిమాల డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌తో వెంకటేష్‌ సినిమా చేయనున్నాడని, దీనికి పరుచూరి ప్రసాద్‌, పరుచూరి కిరిటీలు నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి సంతోషం సగం బలం అనే టైటిల్‌ను పెట్టినట్లుగా కూడా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ చిత్రం విషయంపై కూడా ఇప్పటివరకు వెంకీ తన నిర్ణయం ప్రకటించలేదని, వెంకీ చుట్టూ తిరిగి తిరిగి అలిసిసోయిన డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌ ప్రస్తుతం అదే కథను నాగార్జునకు వినిపించాడని తెలుస్తోంది. స్టోరీ బాగా నచ్చడంతో తాను ఈ సినిమా చేస్తానని నాగార్జున క్రాంతిమాధవ్‌కు మాట ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి వెంకీ కోసం తయారు చేసుకున్న కథ ఇప్పుడు నాగార్జున వద్దకు చేరింది. 

nagarjuna
venkatesh
kranthi madhav
santhosham sagam balam