Advertisementt

ఆ రీమేక్ మూవీ ఎన్టీఆర్ చేస్తాడా?

Fri 07th Aug 2015 04:08 AM
katthi movie,vijay,murugadoss,ntr,tagore madhu  ఆ రీమేక్ మూవీ ఎన్టీఆర్ చేస్తాడా?
ఆ రీమేక్ మూవీ ఎన్టీఆర్ చేస్తాడా?
Advertisement

తమిళంలో వచ్చిన 'జిల్లా' చిత్రాన్ని ఎంతగానో మన స్టార్లతో తీయాలని భావించి చివరకు డబ్బింగ్‌తో సరిపెట్టారు. ఇదే పరిస్థితి విజయ్‌-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ మూవీ 'కత్తి'కి కూడా ఏర్పడుతుందేమో అనే అనుమానాలను ఫిల్మ్‌నగర్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొదట్లో ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌ హీరోగా తీయడానికి ఈ చిత్రం హక్కులు పొందిన 'ఠాగూర్‌' మధు విశ్వప్రయత్నం చేశాడు. కానీ దానికి పవన్‌ అంగీకరించలేదు. అలా చాలా స్టార్స్‌ చుట్టూ తిరిగిన ఈ చిత్రం ఎన్టీఆర్‌ దగ్గర కాస్త నెమ్మదించింది. ఈ చిత్రం రీమేక్‌లో చేయడానికి ఎన్టీఆర్‌ సానుకూలంగా స్పందించడంతో ఆయనే ఈ చిత్రంలో చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని మురుగదాస్‌తో కలిసి ఠాగూర్‌ మధు నిర్మించనున్నాడని, గోపీచంద్‌ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం పూర్తయిన వెంటనే 'కత్తి' రీమేక్‌లో ఎన్టీఆర్‌ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌ సన్నిహితులు మాత్రం ఎన్టీఆర్‌కు 'కత్తి'ని రీమేక్‌ చేసే ఉద్దేశ్యం లేదని తేల్చేస్తున్నారు. మరి కొంతకాలం ఆగితే గానీ ఏ విషయం ఖచ్చితంగా తెలియదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement