సెన్సార్‌ అధికారికి చంపుతామని బెదిరింపులు!

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన బాలీవుడ్‌ మూవీ 'భజరంగీ భాయిజాన్‌' చిత్రం విషయంలో పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌ ఫకర్‌ ఏ ఆలమ్‌కు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్తాన్‌ ప్రజలను కించపరిచేలా ఈ చిత్రంలో వ్యంగ్యమైన యాసను ఉపయోగించారని, కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని... అలాంటివి సెన్సార్‌ చేయకపోవడంపై ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని విడుదలకు అనుమతించడంతో తనను దేశద్రోహిగా ముద్ర వేస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. ఒకవేళ తాను దేశద్రోహినైతే ఈ సినిమాను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా తన దృష్టిలో ద్రోహియేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శలతో సంబంధం లేకుండా పాక్‌ థియేటర్లలో 'భజరంగీ భాయిజాన్‌' చిత్రం బ్రహ్మాండమైన కలెక్షన్లు వసూలు చేస్తోంది. 

bhajarangi bhaijaan
censor officer
threat
pakistan