Advertisementt

ప్రభాస్‌పై బెంగపెట్టుకున్న తల్లి!

Mon 20th Jul 2015 12:16 PM
prabhas,bahubali,sivakumari,bahubali part 2  ప్రభాస్‌పై బెంగపెట్టుకున్న తల్లి!
ప్రభాస్‌పై బెంగపెట్టుకున్న తల్లి!
Advertisement
Ads by CJ

ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి1’ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తోంది. హీరో ప్రభాస్‌కు ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో గుర్తింపు తెచ్చిపెట్టింది. కొడుకు సినిమా ఇంత భారీ విజయం సాధించడంపై ప్రభాస్‌ తల్లి శివకుమారి చాలా ఆనందంగా ఉంది. అయితే ‘బాహుబలి పార్ట్‌2’ విషయంలో మాత్రం ఆమె కొంత ఆందోళన చెందుతోందిట. ‘బాహుబలి పార్ట్‌1’ కోసం ప్రభాస్‌ చాలా సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్‌ ప్రారంభం అయ్యే పార్ట్‌ 2 విషయంలో కూడా దాదాపు ఏడాది కాలం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు  ఎక్కువ రోజుల సమయం తీసుకోవద్దని ఆమె తల్లి సూచించిందిట. ఆమె ఆందోళన అంతా ప్రభాస్‌ పెళ్లి గురించే అని... ‘బాహుబలి పార్ట్‌2 ’ ఎంత ఆలస్యం అయితే ప్రభాస్‌ పెళ్లి కూడా అంతే ఆలస్యం అవుతుందనే ఆమె ఆందోళన చెందుతోందని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ