నాగచైతన్య తప్పు చేశాడా?

ఇటీవలే విడుదలైన సుధీరబాబు తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. అయితే ఈ చిత్రంలో సుధీర్‌బాబు కాకుండా కొద్ది పేరున్న క్లాస్‌ హీరోను తీసుకొని ఉంటే సినిమా రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయేదని అంటున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ కోసం నిర్మాత లడగపాటి శ్రీధర్‌`శిరీషాలు మొదట నాగచైతన్యను కలిశారు. కానీ ఎందువల్లో కానీ ఈ చిత్రం చేయడానికి ఆయన నో చెప్పాడు. ఈ చిత్రానికి నో చెప్పిన ఆయన తన దృష్టిని మొత్తాన్ని ‘దోచెయ్‌’ పైనే పెట్టాడు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంలో కనీసం నాగచైతన్య నటించినా కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉదంతం చూస్తే స్క్రిప్ట్‌ల ఎంపికలో చైతూలో పరిణతి రాలేదని, అందునా ఓ రీమేక్‌ సినిమాను చూసి కూడా అది తనకు సూట్‌ అవుతుందా? లేదా? అనే నిర్ణయానికి ఆయన రాలేకపోవడం ఇందుకు ఉదాహరణగా  చెప్పవచ్చు అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు.

naga chaitanya
krishnamma kalipindi iddarini
sudheer babu
lagadapati sridhar
dohchai
Advertisement
Advertisement