మహేష్ ట్విట్టా..! లేక మౌత్ టాకా..?

సుధీర్‌బాబు నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రానికి మొదటి మూడు నాలుగు రోజులు కలెక్షన్లు లేకపోయినా రోజులు గడిచే కొద్ది ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. వాస్తవానికి తన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం విడుదలైన తర్వాత ఆ చిత్రం చూసి బాగుందని తన ఫ్యాన్స్‌కు చెబూతూ తన బావ మహేష్‌బాబు కనీసం ఒక్కముక్క కూడా మాట్లాడలేదని, కనీసం ట్వీట్‌ కూడా చేయలేదని సుధీర్‌బాబు చాలా బాధ పడి ఫీలయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రాన్ని చూసి మహేష్‌ బాగుందని ట్వీట్‌ చేయడంతో ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగాయా? లేక సినిమా బాగుందనే మౌత్‌టాక్‌ రావడం వల్లే కలెక్షన్లు పెరిగాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయినా ఒకందుకు మహేష్‌ను మెచ్చుకోవాలి.బాగాలేని సినిమాకు ఎంత ప్రచారం., ఎన్ని ట్వీట్స్‌ చేసినా ప్రయోజనం ఉండదని భావించి మహేష్‌ ‘ మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం విషయంలో మౌనంగా ఉన్నాడని, కానీ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం బాగుండటంతో ఆయన ట్వీట్‌ మంచి ఫలితాలను రాబడుతోందని చెప్పకతప్పదు. 

mahesh babu
krishnamma kalipindi iddarinee
sudheer babu