Advertisementt

సుదీప్‌ అభిమాని మృతి..!

Sun 07th Jun 2015 05:29 AM
attharintiki daredi,ranna movie,sudeep,twitter  సుదీప్‌ అభిమాని మృతి..!
సుదీప్‌ అభిమాని మృతి..!
Advertisement
Ads by CJ
తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని సుదీప్‌ హీరోగా కన్నడలో ‘రన్న’ అనే పేరుతో రీమేక్‌ అయింది. ఈ చిత్రం జూన్‌ 4న విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. కన్నడలో స్టార్‌ హీరో అయిన సుదీప్‌కు అక్కడ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కాగా ఈ చిత్రం విడుదల సందర్బంగా అభిమానులు బ్యానర్లు కడుతూ, థియేటర్లను డెకరేట్‌ చేస్తుండగా రాయప్ప అనే అభిమాని కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. ఈ సందర్భంగా సుదీప్‌ అతని కుటుంబానికి సంతాపం తెలిపి రాయప్ప ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. ఈమేరకు ఆయన ఆయన ట్విట్టర్‌లో ట్వీట్స్‌ చేశాడు. నేను మీ అందరి అభిమానం సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మీరు నాకు ఎంతో ముఖ్యం. బ్యానర్లు ముఖ్యం కాదు.నాకు మీరు కావాలి.. ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండండి అని ట్వీట్‌ చేశాడు.  
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ